Hamou attempts to kiss reporter on live TV లైవ్ ఇంటర్వ్యూలో యాంకర్ ను కిస్ చేశాడు..

French open bans maxime hamou for groping reporter on live tv

french open, Maxime Hamou, Maly Thomas, french open 2017, Maxime Hamou news, Maxime Hamou trying to kiss woman reporter, Maxime Hamou video, tennis, tennis news, latest sports news, roland garros, Maly Thomas news, eurosport, chris gayle, Mel McLaughlin

A female television reporter was embarrased by the behaviour of French tennis player who tried to kiss against her will during a live broadcast at Roland Garros, who was banished from the tournament

ITEMVIDEOS: లైవ్ ఇంటర్వ్యూలో యాంకర్ ను కిస్ చేశాడు..

Posted: 05/31/2017 01:13 PM IST
French open bans maxime hamou for groping reporter on live tv

కామా తురానా: నభయం నలజ్జ: అన్న సాంస్కృత వ్యాఖ్యం నిజం చేశాడు ఓ కామాంధుడు. పట్టపగలు.. నట్టనడిరోడ్డు మీద తాను ఓ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అటగాడినన్న విషయాన్ని కూడా మర్చిపోయి మరీ భరితెగించి తనను ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ను అమె అయిష్టత వ్యక్తం చేస్తున్నా ముద్దుపెట్టబోయాడు. అయితే ఇదేదో ఒక్కసారి అనుకుంటే పోరబాటే. ఏకంగా అమెను ముద్దు పెట్టుకోడానికి మూడుసార్లు ప్రయత్నించాడు. ఫలితంగా టోర్నమెంటులో అడే అర్హత వున్నా ఆ ఆటగాడు నిషేధాన్ని ఎదుర్కోంటున్నాడు.

తనకు ఎదురైన ఈ ఘటనపై యాంకర్ మేలి థామస్ తీవ్రంగా అక్షేపించింది. ఓటమిపాలైన ఆటగాడు దానిని ఎలా స్వీకరిస్తున్నాడు.. తదుపరి మ్యాచ్ లను ఎలా అడబోతున్నాడన్న విషయమై అమె 21 ఏళ్ల ఫ్రెంచ్ టెన్నీస్ అటగాడు మాక్సిమ్ హమౌను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా తనకు కుడి వైపును వున్న యాంకర్ ను ఎడమ వైపుకు రమ్మని పిలిచిన అటగాడు హమౌ అమె భుజాలపై చేయి వేసి చాల చనువు వున్నట్లు వ్యవహరించాడు. అమె అక్షేఫించి ప్రశ్నలు అడుగుతున్నా వాటిపై ఏమీ పట్టక అమెను ముద్దాడే ప్రయత్నం చేశాడు.

అతని ప్రవర్తనతో బిత్తరపోయిన అమె హమౌ గురించి తన ట్విట్టర్ అకౌంట్ లో తీవ్రంగా మండిపడింది. లైవ్ ప్రసారంలో ఇలాంటి చర్యలకు పాల్పడిన అటగాడికి బుద్ది చెప్పాలనుకున్నా.. తన విధులకు అటంకం కలుగుతుందని అగిపోయానని చెప్పింది. అది కాస్తా లైవ్ కాకపోయి వుంటే అతని చెంప చెల్లుమనిపించేదానిని పేర్కోంది. దీంతో ప్రపంచ 287వ ర్యాంకు అటగాడు అయిన హమౌ గుర్తింపును రద్దు చేసిన టోర్నీ నిర్వాహక కమిటి.. టోర్నీ నుంచి అతణ్ని పూర్తిగా నిషేధిస్తున్నామని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : french open 2017  maxime hamou  maly thomas  france  paris  badminton  

Other Articles