Nitish Kumar Drive Against Child Marriage and Dowry

Nitish kumar another decision

Bihar Chief Minister Nitish Kumar, Nitish Kumar Child Marriage and Dowry, Bihar Child Marriage and Dowry Campaign, October 2nd Nitish Kumar, Nitish Kumar Mark Decisions, Raees Scene Bihar, Nitish Destroy Liquor Bottels, Child Marriage and Dowry, Nitish Kumar Another Decision, Nitish Kumar Special Drive, Nitish Kumar Sensational Decision, After Liquor Ban in Bihar, CM Nitish Kumar

Bihar Chief Minister Nitish Kumar today announced that his government would launch a vigorous campaign against Child Marriage and Dowry in the state.

నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం

Posted: 05/30/2017 08:30 AM IST
Nitish kumar another decision

ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా సంపూర్ణ మద్యపాన నిషేధం విధించి శభాష్ అనిపించుకున్న బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్, ఇంకో సంచలనానికి రెడీ అయిపోతున్నాడు. బాల్య వివాహాలు, వరకట్న దురాచారంపై సమర భేరి మోగించేందుకు గాంధీ జయంతిని వేదిక చేసుకోబోతున్నాడు. అక్టోబర్ 2 నుంచి వాటికి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్టు ప్రకటించాడు.

మహిళల కోరిక మేరకు మద్య నిషేధం విధించిన ముఖ్యమంత్రి ఇటీవల ప్రజలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమం ‘లోక్ సంవాద్’ సందర్భంగా ఓ మహిళతో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పాట్నాలో నిర్వహించిన మహావీర్ వత్సాలయ కేన్సర్ ఆసుపత్రి 11వ వ్యవస్థాపక దినోత్సంలో పాల్గొన్న నితిశ్ కుమార్ మాట్లాడాడు. బాల్యవివాహాలపై ఓ మహిళ జరుపుతున్న ప్రచారం తనకు స్ఫూర్తినిచ్చిందని నితిశ్ పేర్కొన్నారు.

2005లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయటం, సామాజిక దురాచారాలపై యుద్ధంతోపాటు ఆడపిల్లల రక్షణ, నిషేధం, డి-అడిక్షన్, మహిళా సాధికారత వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు వివరించాడు. మహిళలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం వంటి సమస్యలు ఉన్నాయని, త్వరలోనే వాటిపైనా దృష్టి సారిస్తామని నితిశ్ పేర్కొన్నాడు. అన్ని రంగాల్లో వెనుకబడిన బీహార్ ను టాప్ 5 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిపేందుకే తాను కృషి చేస్తానని వెల్లడించాడు.

ఇక మద్యపాన నిషేధం అమలులో ఉన్నప్పటికీ కొందరు అధికారులు సీజ్ చేసిన మందు బాటిళ్లను స్వాహా చేయటం నితీశ్ కు ఆగ్రహాం తెప్పించింది. ఎలుకల పేరు చెప్పి లక్షల్లో మందు సీసాలను ఖాళీ చేయటంపై విచారణ కొనసాగుతుండగానే సీజ్ చేసిన బాటిళ్లను రోడ్డు రోలర్ తో తొక్కించేసి నాశనం చేయాలని అధికారులను ఆదేశించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar  CM Nitish Kumar  Dowry and Child Marriage  

Other Articles