Hotels and chemists one day strike in South India

Hotels association to observe bandh against gst

Hotels GST Bandh, Chemists Bandh, Medical Shops Strike, Medical Shops Bandh, All India Drug Association Bandh, May 30 Bandh, May 30 Strike, Hotels Close GST, GST South India Bandh, Hotel associations Call for bandh, Chemists' strike

Hotels, chemists strike today i.e. May 30 in South India. Hotels and Restaurant Association, against the GST rate. Drug Association against Online Sale.

మొత్తం అంతా బంద్ వాతావరణమే

Posted: 05/30/2017 08:06 AM IST
Hotels association to observe bandh against gst

గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్(జీఎస్టీ) సవరణలతో తమపై భారం పెంచటాన్ని వ్యతిరేకిస్తూ దక్షిణ భారతదేశంలో నేడు మొత్తం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడనున్నాయి. త్వరలో జీఎస్టీ అమలులోకి రానుండటం, ఏ.సి. హోటళ్లలో 18 శాతం, నాన్ ఏ.సి. హోటళ్లలో 12 శాతం పన్ను విధిస్తూ సవరణలు చేసిన కేంద్రం.

ప్రస్తుతం ఏపీలో 5 శాతం, తెలంగాణలో 2 శాతం పన్ను విధిస్తున్నాయి. ఇది ఒక్కసారిగా 18 శాతానికి పెంచడంతో హోటళ్లలో తినాలంటే వినియోగదారులు బెంబేలెత్తిపోతారన్న ఆందోళన వారిలో
నెలకొంది. తద్వారా తమ వ్యాపారాలు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్లు చెబుతున్నాయి. ఈ మేరకు మంగళవారం హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్‌ బంద్‌ కు పిలుపునిచ్చాయి. నేడు హైదరాబాదుతో పాటు, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ మొత్తం హోటళ్లు బంద్ కానున్నాయి.

మెడికల షాపుల బంద్:

ఇంకోవైపు ఆన్ లైన్ లో మందుల విక్రయంపై చేసిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ మెడికల్ షాపు అసోసియేషన్ కూడా నేడు బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ మందుల వ్యాపారాల వల్ల స్పష్టత లేకుండా ప్రజల ప్రాణాలు హరించుకుపోయే ప్రమాదం ఉందని డ్రగ్స్‌ అసోషియేషన్‌ వాదిస్తూ వస్తోంది. ఈ క్రమంలో మే 30న దేశ వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. అయితే బంద్‌లో పాల్గొంటూనే అత్యవసర సేవలకు అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక కౌంటర్‌ లు ఏర్పాటు చేస్తున్నట్లు అసోసియేషన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hotel associations  Druggists  Call for bandh  

Other Articles