KCR survey predicts 111 seats for TRS తెలంగాణలో మోడీ మానియా వుండదట.. మళ్లి తమకే బ్రహ్మరథమట

No modi wave in telangana insists cm k chandrashekar rao

KCR on Modi Mania, KCR on modi magic, KCR on namo, BJP, Chandrasekhar Rao, congress, KCR Survey, Telangana assembly elections, trs

The BJP will not get a single seat in the Telangana assembly elections in 2019 while the Congress will get two, says a survey conducted on behalf of Chief Minister K. Chandrasekhar Rao.

తెలంగాణలో మోడీ మానియా వుండదట.. మళ్లి తమకే బ్రహ్మరథమట

Posted: 05/27/2017 08:18 PM IST
No modi wave in telangana insists cm k chandrashekar rao

రాబోయే రోజుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హవా ఉండదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం టీఆర్ఎస్ దేనని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. రానున్న ఎన్నికలపై తాజా సర్వేలు పలు అంశాలు వెల్లడించాయని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా తమ ప్రభుత్వం గత ఎన్నికల కన్నా అధికంగా మెజారీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  

తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ పార్టీకి 111 సీట్లు రావడం ఖాయమని కేసీఆర్ వెల్లడించారు. టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఆయన సర్వే నివేదికను బయటపెట్టారు. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లకు గానూ టీఆర్ఎస్ కు 111, మిత్రపక్షం ఎంఐఎంకు 6 సీట్లు, విపక్షాలకు కేవలం 2 సీట్లు వస్తాయని తాను చేయించిన సర్వేలో తేలిందని తెలిపారు. తెలంగాణలో ప్రత్యర్థి పార్టీలు చేస్తున్నదంతా కేవలం మీడియాకే పరిమితమని, వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా వున్నాయిన కేసీఆర్ చెప్పడంతో టీఆర్ఎస్ నేతలు సంతోషంలో మునిగిపోయారు. అలాగే త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తటస్థంగా ఉండాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Chandrasekhar Rao  congress  KCR Survey  Telangana assembly elections  trs  

Other Articles