delhi, hyderabad on high alert దేశంలో ఉగ్రవాదులు చోరబడ్డారు.. ఢిల్లీ, హైదరాబాద్ లలో హైఅలర్ట్

Delhi hyderabad on high terror alert

IB warns of terror alert, terror alert to delhi, terror alert to hyderabad, terror alert to indian states, intelligence bureau, Delhi, Hyderabad, High alert, security, RGIA, central intelligence, security tightened

In the backdrop of central intelligence agencies' alert about possibility of Pakistani nationals sneaking into India to carry out subversive activities, delhi and hyderabad put on high alert.

దేశంలో ఉగ్రవాదులు చోరబడ్డారు.. ఢిల్లీ, హైదరాబాద్ లలో హైఅలర్ట్

Posted: 05/27/2017 07:23 PM IST
Delhi hyderabad on high terror alert

ధేశంలో ఉగ్రవాదులు పడ్డారు. అవును నిజంగానే సుమారు ఇరవై మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని, ఢిల్లీ, పంజాబ్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు కేంద్ర నిఘా సంస్థ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. ఉగ్రవాదలు చోరబడ్డారన్న వార్తలతో అటు దేశరాజధాని ఢిల్లీతో పాటు హిట్ లిస్టులో వున్న పలు రాష్ట్రాలను కేంద్ర ఇంటెలిన్స్ అప్రమత్తం చేసింది.

కాగా ఉగ్రవాదుల జాబితాలో హైదరాబాద్ నగరం కూడా ఉండటంతో ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో దాడులు జరిగేందుకు అవకాశం ఉన్న వ్యాపార సముదాయాలు, మాల్స్ వద్ద భద్రతా లోపాలను పోలీసులు గుర్తించి.. భద్రత లోపభూయిష్టంగా వున్న షాపుల యజమానులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక జనసామార్థ్యం అధికంగా వుండే ప్రాంతాల్లో విడిచివెళ్లిన వస్తువులపై తమకు సమాచారం కల్పించాలని పోలీసులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు.

మరోపక్క, ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన క్రమంలో ఇలాంటి హెచ్చరికలు రావడంతో మందిరాలు, చర్చీలతో పాటు మసీదులు, పలు మతాలకు చెందిన ప్రార్థనా స్థలాల్లో కూడా పోలీసులు నిఘాను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఎటువంటి దారుణ ఘటనలకు ఉగ్రవాదులు పాల్పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కాగా, గతంలో రంజాన్ మాసంలో దాడులకు కుట్ర పన్నిన తొమ్మిది మంది ఐఎస్ ఉగ్రవాదులను హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు అరెస్టు చేయగా, మళ్లీ రంజాన్ నాటికి హెచ్చరికలు రావడం ప్రజల్లను కూడా అందోళనకు గురిచేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  Hyderabad  High alert  security  RGIA  

Other Articles