Petrol Station Staff Rewarded for Putting Out Fire in China

Man sets bike on fire at gas station china

China Petrol Station Video, Petrol Station Accident Video, Man Sets Bike, Petrol Station Staff Reward, Fire At Gas Station China

Man Sets Bike On Fire At Gas Station. Watch What The Staff Does Next.

ITEMVIDEOS:పెట్రోల్ బంక్ లో భయానక వీడియో

Posted: 05/27/2017 04:01 PM IST
Man sets bike on fire at gas station china

పిచ్చి మూలానో లేక మరేయితర కారణం మూలంగానో ఓ వ్యక్తి చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చైనా సిచువాన్ ప్రొవిన్స్ లోని ఇబిన్ పట్టణం. అక్కడ స్థానికంగా ఉన్న ఓ పెట్రోల్ బంక్ కి ఓ వ్యక్తి బైక్ మీద వచ్చాడు. ఉన్నపళంగా పెట్రోల్ నింపుకున్నాక ఒక్కసారిగా పెట్రోల్ అంటించాడు.

అంతే మంటలు చెలరేగటం చూసి పక్కనే ఉన్న సేఫ్టీ గ్యాస్ తో మంటలు ఆర్పేందుకు యత్నించింది ఒక మహిళా సిబ్బంది. ఇంతలో ఆ వ్యక్తి బైక్ ను పెట్రోల్ బంకర్ మీదకు తోసేయటంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. చుట్టుపక్కల ఉన్న సిబ్బంది అంతా మంటలు ఆర్పేందుకు ట్రై చేశారు. ఆ వ్యక్తి మంటలో దూకగా ఒక సిబ్బంది ప్రాణాలకు తెగించి అతని రక్షించగా, మరో వ్యక్తి బైక్ ను బంకర్ కు దూరంగా లాక్కెల్లాడు.

మొత్తానికి తమ సాహసం ప్రదర్శించి పెద్ద పేలుడు నుంచి, భారీ డ్యామేజ్ నుంచి రక్షించిన సిబ్బందికి 65,000 యువాన్ లను రివార్డుగా ప్రకటించారు. ఒకవేళ సమయానికి వాళ్లు గనుక స్పందించి ఉండకపోతే మాత్రం పరిస్థితి మరీ దారుణంగా ఉండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పోలీసులు ఆ బైకర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  Gas Station Fire  Staff Reward  

Other Articles