Trump Defends Sharing Key Information with Russia

Trump is a serious threat to american national security

Donald Trump, Trump National Threat, Donald Trump Russia, Russia Donald Trump Sharing, Donald Trump Information Russia, Donald Trump Russia Help, Classified Information Russia, Russia America ISIS, Terrorist Information Donald Trump, America Secrets Donald Trump, Trump Secrets Leakage, American National Security Trump, Trump Most Dangerous, America President Impeachment , Donald Trump Impeachment

US lawmakers want President Donald Trump to explain giving intelligence to Russia about ISIS. Donald Trump defends sharing classified information with Russia

బాబోయ్.. ట్రంప్ మరీ అంత డేంజరా?

Posted: 05/17/2017 10:09 AM IST
Trump is a serious threat to american national security

అమెరికాలో వాషింగ్ పోస్ట్ కథనం చేస్తున్న రగడ అంతా ఇంతా కాదు. ఏకంగా అమెరికా అధ్యక్ష పదవికే ఎసరు పెట్టేలా ప్రచురించిన వ్యాసంతో డొనాల్డ్ ట్రంప్ కు తలనొప్పి వచ్చి పడింది. పైగా ఆ ఆరోపణలను వైట్ హౌస్ ఢిపెన్స్ చేస్తున్న క్రమంలో అవును అందులో తప్పేంటని ట్రంప్ వ్యాఖ్యానించటంతో వివాదం మరింత ముదిరింది. దీంతో రెండు నెలల క్రితం ప్రొఫెసర్‌ అలన్‌ లిట్చ్‌మన్‌ చెప్పిన జోస్యం ఫలించేలా కనిపిస్తోంది. ట్రంప్ ప్రెసిడెంట్ అవుతాడని, తర్వాత మహాభియోగం ద్వారా దిగిపోతాడని 70 ఏళ్ల రాజకీయ అనాలసిస్ట్ లిట్చ్ మన్ వెల్లడించాడు.


ఇంతకీ అభియోగం ఏంటి?

అమెరికాలోని ప్రధాన పత్రికల్లో ఒకటైన వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం... ఈ నెల 10వ తేదీన డొనాల్డ్ ట్రంప్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తో సమావేశమయ్యారు. వైట్ హౌస్ లో జరిగిన ఈ సమావేశంలో ట్రంప్ తో పాటు అమెరికాలో రష్యా రాయబారి సెర్గీ కిస్లయాక్‌, మరో ఇద్దరు అమెరికా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఐసిస్‌ నుంచి ఎదురవుతున్న సవాళ్లతో పాటు వివిధ సమస్యలపై చర్చించారు. పాశ్చాత్యదేశాల్లో దాడులకు ఐసిస్‌ పన్నిన కుట్రల గురించి మాట్లాడుతూ, మిత్రదేశాలకు చెందిన నిఘా వ్యవస్థల ద్వారా అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రతిరోజూ తనకందుతుందని ట్రంప్ రష్యా ప్రతినిధులకు తెలిపారు. అంతే కాకుండా తాను ల్యాప్ ట్యాప్, మొబైళ్లను విమానాల్లో నిషేధించడం వెనుక కారణం... ల్యాప్‌ ట్యాప్‌ ల ద్వారా విమానాల పేల్చివేతకు ఐసిస్‌ సిరియాలోని ఒక పట్టణంలో వ్యూహరచన చేసిందని చెప్పారు. ఈ వివరాలతో పాటు, మరింత రహస్యమైన సమాచారాన్ని ఆయన వారితో పంచుకున్నారు.

అయితే ఆ వివరాలను అమెరికా ప్రయోజనాల దృష్ట్యా వెల్లడించడం లేదని వాషింగ్టన్‌ పోస్ట్‌ తన కథనంలో వెల్లడించింది. వెంటనే రంగంలోకి దిగిన వైట్‌ హౌస్‌ వాషింగ్టన్ పోస్ట్ కథనం ఊహాజనితమంటూ ఖండించింది. అయినప్పటికీ ట్రంప్ విశ్వసనీయతపై అనుమానాలు మాత్రం పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఆందోళనలు మొదలుకాగా, న్యూయార్క్ టైమ్స్ లాంటి ప్రముఖ పత్రికల్లో కూడా వ్యతిరేక వార్తలు వస్తున్నాయి.

అంత ప్రమాదమా?

ట్రంప్‌ వెల్లడించిన సమాచారం ఒక మిత్రదేశం అమెరికాతో పంచుకున్న అత్యంత రహస్య నిఘా సమాచారమని, ఇది కేవలం అమెరికా అధికార వ్యవస్థలో పైస్థాయిలో అతికొద్ది మంది ఉన్నతాధికారులకు మాత్రమే తెలియాల్సిందని... అలాంటి దానిని ట్రంప్ శత్రుదేశమైన రష్యాతో ఎలా పంచుకుంటారంటూ ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు. మిత్రదేశాలకు కూడా వెల్లడించని సమాచారాన్ని రష్యాకు వెల్లడించడంతో ట్రంప్ రష్యా ఏజెంట్ అన్న విషయం నిర్ధారణ అవుతోందని వారు ఆరోపిస్తున్నారు. దీంతో ఐసిస్ కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్న మిత్రదేశాలు ఇకపై అందించే అవకాశం ఉండదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంతే కాకుండా తమకు సంబంధించిన సమాచారాన్ని బయటకు వెల్లడిస్తున్న గూఢచారుల గురించి ఐసిస్ వేట మొదలు పెడితే... మొదటికే మోసం వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా హిల్లరీ క్లింటన్ మెయిల్స్ లీక్ చేయడంలో రష్యా అధికారులు కీలకంగా వ్యవహరించారని, రష్యా అండతోనే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారన్నది నిర్ధారణ అయిందని వారు స్పష్టం చేస్తున్నారు. 

వైట్ హౌజ్ అలా.. ట్రంప్ ఇలా...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అసత్య ప్రచారం తగదని మీడియా సంస్థలకు వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. మీడియాలో వస్తున్న విధంగా అధ్యక్షుడు ట్రంప్ తాజా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జనరల్‌ ఫ్లైన్‌ పై విచారణను నిలిపేయాలని ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ లేదా మరే ఇతర వ్యక్తిని కోరలేదని స్పష్టం చేసింది. జనరల్ మైకేల్ ఫ్లెన్ దేశ రక్షణ కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేసింది.

'అవును, అమెరికా అధ్యక్షుడిగా నేను కొన్ని విషయాలను రష్యాతో పంచుకున్నాను' అంటూ ట్రంప్ సంచలన ప్రకటన చేశాడు. తీవ్రవాదం, విమాన ప్రయాణికుల భద్రతకు సంబంధించిన కొన్ని వాస్తవాలను రష్యా ఉన్నతాధికారులకు చెప్పానని ఆయన తెలిపాడు. అలా చెప్పే సంపూర్ణ అధికారం తనకు ఉందని ఆయన స్పష్టం చేశారు. మానవతాదృక్పథంతోనే తాను రష్యాకు ఆ సమాచారం అందించానని ఆయన అన్నారు. సిరియాతో పాటు పలు దేశాల్లో విస్తరిస్తున్న ఐసిస్‌ తో పాటు తీవ్రవాదంపై పోరాటంలో రష్యా కలిసిరావాలని, రష్యా పోరును మరింత తీవ్రం చేయాలని తాను కోరుకుంటున్నందున అవసరమయిన సమాచారాన్ని తాను పంచుకున్నానని తేల్చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US President  Donald Trump  Russia  Key Information  

Other Articles