Actor Pawan Kalyan Twitter hacked

Pawan kalyan twitter hacked

Pawan Kalyan Twitter hack, Pawan Twitter Hacked, Janasena Pawan Twitter, Janasena Twitter Hack, Politician Pawan Kalyan Twitter, PK Twitter Hacked, TTD Wanna Cry, Wanna Cry Ransomware, Wanna Cry Virus

Actor, Janasena Party Chief Pawan Kalyan Twitter Hacked. TTD Website also tampered with Wanna Cry Malware.

పవన్ ట్విట్టర్ హ్యాక్ అయ్యింది

Posted: 05/17/2017 09:34 AM IST
Pawan kalyan twitter hacked

టాలీవుడ్ స్టార్ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. ఈ ఖాతాను హ్యాకర్లు బ్లాక్ చేశారు. ఆయన పెట్టిన పోస్టులేవీ అభిమానులకు చేరడం లేదు. ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ పై సమాచార సాంకేతిక శాఖ నిపుణులను పవన్ కార్యాలయ సిబ్బంది సంప్రదిస్తోంది.

సాధ్యమైనంత త్వరలో పవన్ ఖాతాను తిరిగి అధీనంలోకి తీసుకుంటామని జనసేన వర్గాలు వెల్లడించాయి. కాగా, ట్విట్టర్ లో ఎంతో యాక్టివ్ గా ఉండే పవన్, పలు అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇది వాన్నా క్రై ప్రభావమా? లేక ఎవరైనా ఆకతాయి చేసిన యత్నామా? తెలియాల్సి ఉంది.

 

టీడీడీకి వాన్నా క్రై దెబ్బ.. నో డేంజర్

ప్రపంచం మొత్తాన్ని బెంబేలెత్తించిన ఉత్తరకొరియా లాజరస్ గ్రూప్ ర్యాన్సమ్ వేర్ వాన్నా క్రై బారిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పడింది. టీటీడీకి చెందిన సుమారు 30 కంప్యూటర్లు ఈ వైరస్‌ బారిన పడి హ్యాక్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ సైబర్ దాడి కేవలం పరిపానలనా పరిమైన అంశాలకు సంధించిన కంప్యూటర్లకు మాత్రమే పరిమితం కావడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ సైబర్ ఎటాక్ వల్ల భక్తులకు సమాచారం అందించే వ్యవస్థపై ఎలాంటి ప్రభావం లేదని స్పష్టం చేశారు. టీటీడీ అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన సాఫ్ట్‌ వేర్‌ ను వినియోగిస్తున్నప్పటికీ సైబర్ హ్యాకింగ్ కు గురికావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

అయితే కిందిస్థాయి సిబ్బంది ఉన్నతాధికారులకు తెలియకుండా పైరేటెడ్‌ సాఫ్ట్‌ వేర్‌ ను కంప్యూటర్లలో నిక్షిప్తం చేసిన కారణంగా ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సైబర్ అటాక్ అంశం తెలియగానే ఆ కంప్యూటర్లను అధికారులు యుద్ధ ప్రాతిపదికన వాటిని తొలగించి, ఇతర కంప్యూటర్లకు ఆ వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు, భక్తులు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Twitter Hack  TTD Website  Wanna Cry Virus  

Other Articles