ATMs still run dry with Wanna Cry Effect

Atms still run dry in hyderabad and bangalore

RBI, Wanna Cry ATMs, Hyderabad ATMs Dry, No Cash ATM Hyderabad, Hyderabad ATMs, ATM No Cash, RBI Wanna Cry, Cyber Attack Hyderabad ATMs, Metro Cities ATM Service, ATMs Close, No Cash Board, Out of Service Board ATMs, ATMs Dry

RBI asks ATMs to Shut because of Ransomware. No cash inflow, ATMs continue to run dry. ATMs Not Opened in Hyderabad and Bangalore.

అయ్యా.. మా దగ్గర పైసలు లేవ్

Posted: 05/16/2017 08:58 AM IST
Atms still run dry in hyderabad and bangalore

నోట్ల రద్దు ప్రకటన నుంచి ఖాతాదారుడి బతుకు మరీ దారుణంగా తయారయిపోయింది. కిలో మీటర్ల మేర క్యూ లో నిల్చుని వెయ్యి, రెండు వేలో సంపాదించి మురిసిపోయిన జనాలు ఇప్పుడు ఏటీఎంలు వెక్కిరిస్తుండటంతో ఏం చేయాలో తెలీని పరిస్థితికి చేరిపోయాడు. నగదు రహిత లావాదేవీలంటూ ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లను ప్రోత్సహిస్తున్న ఆర్థిక శాఖ, బ్యాంకులు మినిమమ్ లిక్విడ్ క్యాష్ విషయంలో కూడా మొండిచేయినే చూపిస్తున్నాయి.

కొత్త నోట్ల ముద్రతో మొన్నటి నుంచి కాస్త ఊరట పొందిన ప్రజలకు మళ్లీ ఇప్పుడు నోటు కష్టాలు వచ్చి పడ్డాయి. గత మూడు రోజులుగా విండోస్ లోని లోపాల సాయంతో కంప్యూటర్లలోకి విస్తరిస్తూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ‘వన్నా క్రై’ కంప్యూటర్‌ వైరస్‌ భయంతో ఏటీఎం కష్టాలు మొదలయ్యాయి. ఏటీఎంలలో పాతతరం విండోస్ ఎక్స్ పీ సాఫ్ట్ వేర్ వాడుతుండడంతో ముందు జాగ్రత్తగా వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎంలను మూసేశారు. నిన్నటికే ప్రైవేటు బ్యాంకు ఏటీఎంలు మూతపడగా, నేడు ప్రభుత్వ బ్యాంకులు కూడా మూసేయిస్తున్న ఏటీఎంల జాబితాలో చేరాయి.

హైదరాబాదు, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ఏటీఎంల షటర్ లు మూతపడిపోయాయి. పలువురు డిజిటల్ సేవలను వినియోగించుకుంటుండగా, వాటిపై అవగాహన లేని వారు, చిల్లర వ్యాపారస్థులు మాత్రం నగదు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాఫ్ట్ వేర్ అప్ డేట్ గురించి ప్రకటన చేసి 36 గంటలు గడుస్తున్నప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవటం దారుణం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Wanna Cry  Hyderabad  ATMs Close  

Other Articles