Jagan Meet Modi only For Personal Agenda

Purpose of jagan meet modi

YSRCP Chief Y.S. Jagan, Jagan Meet, Jagan Personal Agenda, Jagan Emperor of Corruption, Jagan Modi Personal Meet, TDP Fumes Jagan Modi Meet, Roja Jagan PM Modi Meet, Jagan Chandrababu Meet Modi, TDP YSRCP PM Modi, TDP BJP Break Up, Jagan Meet BJP, AP Govt Torture Jagan

YSRCP Chief Y.S. Jagan Mohan Reddy that he had a personal agenda behind his meeting with Prime Minister Narendra Modi. YSRCP Fire Brand MLA Roja Denies those allegations.

జగన్ పర్సనల్ యవ్వారంతో ఇబ్బందులు

Posted: 05/15/2017 09:06 AM IST
Purpose of jagan meet modi

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తూ ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన విషయం తెలిసిందే. ప్రజా సమస్యల పై తన గళం వినిపించేందుకే వచ్చానని మీడియాతో చెప్పుకొచ్చిన జగన్ రాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్ధతు ఎన్డీయేకే నంటూ ప్రకటించాడు. బీజేపీ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోయినా కోరి మరి వెళ్లి వైఎస్సార్పీపీ అధినేత ఇలా సపోర్ట్ గురించి వ్యాఖ్యలు చేసేసరికి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

కానీ, జగన్ కు ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వటం, తమ అధినేత చంద్రబాబును టార్గెట్ చేయటంతో టీడీపీ నేతలకు చిర్రెత్తుకొచ్చింది. ఈ క్రమంలో జగన్ ను ఇరకున పెట్టే ఓ పాశుపతాస్త్రాన్ని వాళ్ల చేతికి దొరికినట్లయ్యింది. కేవలం ఆంధ్రప్రదేశ్ సమస్యల పరిష్కారం కోసమే ప్రధానిని కలిశానని, మిర్చి రైతులకు మద్దతు ధర పెంచాలని, ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలించమని, అగ్రిగోల్డ్‌పై సీబీఐతో దర్యాప్తు చేయించాలని, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా చూడాలని.. ఇలా బోలెడన్ని సమస్యలను ప్రధానికి నివేదించినట్టు జగన్ చెప్పాడు. ఒకటి రెండు అంశాల్లో తప్ప బీజేపీకి, తమ పార్టీకి ఎలాంటి విభేదాలు కూడా లేవని స్పష్టం చేశాడు.

కానీ లోపల జరిగిన సీన్ వేరే అని ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది. జగన్ ప్రధానికి ఇచ్చినట్టు చెబుతున్న వినతిపత్రం తాలుకూ కాపీని సంపాదించిన ఆ మీడియా అందులోని అంశాలతో అసలు విషయం బయటపెట్టింది. ప్రస్తుతం బయటపడిన జగన్ వినతిపత్రం ఏపీలో దుమారం రేపుతోంది. దీని ఆధారంగా ఎదురుదాడికి దిగిన టీడీపీ, రాష్ట్రపతి ఎన్నికల్లో మద్ధతు ఇచ్చేందుకు ప్రతిగా ప్రత్యేక హోదా డిమాండ్ ను బలంగా వినిపించే అవకాశాన్ని ఎందుకు చేజార్చుకున్నాడంటూ ప్రశ్నలు కురిపిస్తోంది. కాగా, దీనికి వైసీపీ కౌంటర్ ఇవ్వటం ప్రారంభించింది. ఎంపరర్ ఆఫ్ కరప్షన్ బుక్ ను మోదీకి సమర్పించాడని వివరణ ఇచ్చుకుంది.

 

‘‘ప్రధానిని కలిసిన జగన్ ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి కాకుండా తన సమస్యల పరిష్కారం కోసమే కలిశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను వేధిస్తోందని ప్రధానికి ఫిర్యాదు చేస్తూ ఏడు పేజీల వినతిపత్రాన్ని సమర్పించారు. టీడీపీ మాయలో పడిన ఈడీ అధికారులు తనను, తన కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తున్నారని వాపోయారు. తనను కాపాడాలని కోరారు. ఈ మేరకు జగన్ హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జోన్‌లో పనిచేస్తున్న జాయింట్ డైరెక్టర్ ఉమాశంకర్‌గౌడ్, అసిస్టెంట్ డైరెక్టర్ బీఎస్ గాంధీల పేర్లను ప్రధాని వద్ద ప్రస్తావించాడు. వారిద్దరూ టీడీపీతో కుమ్మక్కై తనను ఇబ్బంది పెడుతున్నట్టు ఫిర్యాదు చేశారు. పనిలోపనిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిగా ఈ మూడేళ్లలో చంద్రబాబు రూ.1.5 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించాడు’’ అని అందులో ఉంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  PM Modi  Personal Agenda  

Other Articles