Ransomware Cyber-Attack hits 150 Countries

Biggest ransomware attack again

Cyber Attack, Massive Cyber Attack, Monday Cyber Attack, Ransomware Cyber-Attack, Ransomware Attack, WannaCry Attack, WannaCry Malware Attack, Massive Cyber Attack,Microsoft Cyber Attack, Cyber Attack India, 150 Countries Cyber Attack

More Ransomware Cases 'likely on Monday'. More disruptions feared from Cyber Attack on Monday; Microsoft slams government secrecy

అలర్ట్ : ప్రపంచానికి మహా ముప్పు

Posted: 05/15/2017 08:53 AM IST
Biggest ransomware attack again

ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం 'వాన్నా క్రై' మాల్‌ వేర్‌ సృష్టించిన కలకలం ఇంకా కొలిక్కి రాకముందే, సోమవారం నాడు మరో భారీ సైబర్ దాడి జరగనుందట. ఇక ఈ రాబోయే ప్రమాదాన్ని ఎదుర్కోవడం 'వాన్నా క్రై'ని ఎదుర్కొన్నంత సులువుగా ఉండబోదని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాత వైరస్ ల కోడింగ్ లో మార్పులు చేసిన హ్యాకర్లు, ప్రపంచ సైబర్ సిస్టమ్ ను సర్వనాశనం చేసేందుకు కదులుతున్నారని యూకేకు చెందిన డారెన్‌ హుస్‌ తెలిపాడు.

సుమారు 150 దేశాలు, 2 లక్షల కంప్యూటర్ లు ఈ భారీ హ్యాకింగ్ కు బాధితులుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా విండోస్ ఎక్స పీ యూజర్లనే ఇది ప్రధానంగా టార్గెట్ చేయబోతుందని సమాచారం. మరోపక్క మైక్రో సాఫ్ట్ సంస్థ కూడా ఈ విషయంలో హెచ్చరికలు జారీ చేస్తోంది. కాగా, దాదాపు 100 దేశాలను వణికించిన 'వాన్నా క్రై' నుంచి ఇప్పుడిప్పుడే పలు సంస్థలు కోలుకుంటున్నాయి.

యూకేలో 48 కంపెనీల కంప్యూటర్లు హ్యాక్ నకు గురికాగా, ఆరు కంపెనీలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఇదిలావుండగా, తమ అధీనంలోకి వచ్చిన డేటాను వెనక్కు ఇచ్చేందుకు ఒక్కో కంప్యూటర్ నుంచి 300 డాలర్లు వసూలు చేస్తున్న 'వాన్నా క్రై' సృష్టికర్తలు, ఇప్పటికే 22 వేల డాలర్ల ఆదాయాన్ని పొందినట్టు తెలుస్తోంది. దీన్ని బిట్ కాయిన్ల రూపంలో మాత్రమే చెల్లించాలని వారు షరతులు పెడుతున్న సంగతి విదితమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cyber Attack  WannaCry  Monday Fear  

Other Articles