Pawan kalyan Ready for Padayatra in Anantapur

Pawan kalyan reiterates will contest from ananthapur only

Pawan Kalyan, Pawan Kalyan Padayatra, Ananthapur Padayatra, Ananthapur Pawan Kalyan, Pawan Kalyan Press Meet, Ananthapur Janasena, Pawan Kalyan Quit Movies, Pawan Kalyan Not Complete Politician, Pawan Kalyan Complete Politician, Pawan Kalyan Janasena Anantapur, Pawan Padayatra, Pawan Quit Films, Anantapur Padayatra, Janasena Press Meet, JanaSena Pawan Kalyan, Amaravati People Pawan Kalyan, Undavalli Penumaka Pawan Kalyan, Pawan Kalyan Milk, Pawan Kalyan Pooja

Pawan Kalyan says he is ready to quit acting, to focus on Jana Sena party. Again reiterates 'Will contest from Ananthapur only' and Padayatra Soon.

అనంత నుంచి పోటీ.. పవన్ పై ఒత్తిడి

Posted: 05/15/2017 08:25 AM IST
Pawan kalyan reiterates will contest from ananthapur only

ఎన్ని ఆటంకాలు ఎదురైనా తాను అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయడం ఖాయమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఘంటా పథంగా చెప్పేశాడు. పార్టీ కోసం స్పీకర్లు, కంటెంట్ రైటర్లు, అనలిస్టులుగా సేవలందించేందుకు అనంతపురం జిల్లా నుంచి వచ్చిన నూతన నాయకులు పవన్ కల్యాణ్ ని కలిశాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో సుమారు నూట యాభై మందికి పైగా ప్రతినిధులు ఆయనతో సమావేశమయ్యాడు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తన తుదిశ్వాస విడిచే వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని ప్రకటించాడు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిని కాదని కొందరు విమర్శిస్తున్నారని, అసలు పూర్తి స్థాయి రాజకీయ నాయకులు ఎవరున్నారని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లోకి వచ్చినా వ్యాపారాల్లో రూ.కోట్లు సంపాదించుకుంటున్నారని, అవసరమైతే తాను సినిమాల్లో నటించడం వాయిదా వేసుకుంటానని పేర్కొన్నాడు. సినిమాలన్నా.. తమ కుటుంబం, సిబ్బంది కోసమే సినిమాల్లో నటిస్తున్నానన్న పవన్, సినిమా అన్నా.. సినీ పరిశ్రమ అన్నా అపారమైన గౌరవం ఉందని చెప్పుకొ్చాడు.  అనంత జిల్లాలో త్వరలో తాను పాదయాత్ర చేయనున్నట్టు ఈ సందర్భంగా పవన్ ప్రకటించాడు.

పవన్ మాట నిలబెట్టుకోవాలి

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, గతంలో తానిచ్చిన హామీపై నిలబడి తమను ఆదుకోవాలని కోరుతూ అమరావతి ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాక రైతులు ఆయన ప్లెక్సీలకు పూజలు చేశారు. గత సంవత్సరం ఉండవల్లికి వచ్చిన ఆయన, ఈ ప్రాంతంలో భూ సేకరణకు తాను వ్యతిరేకినని, ప్రభుత్వం నోటీసు ఇస్తే రైతులకు అండగా ఉండి ఉద్యమిస్తానని చేసిన హెచ్చరికలను గుర్తు చేస్తూ, ఇప్పుడు ప్రభుత్వం భూ సేకరణ నోటీసులు ఇచ్చినందున దాన్ని వెనక్కు తీసుకునేలా పవన్ ఒత్తిడి చేయాలని కోరుతున్నారు. ఆయన మాట నిలుపుకోవాలంటూ, ప్లెక్సీలకు పాలాభిషేకం చేసిన రైతులు, పవన్ చిత్రపటం ముందు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena Press Meet  Anantapur Padayatra  

Other Articles