దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీలోని నిర్భయ ఘటనలో నిందితులందరికీ ఉరి శిక్షను ఖారారు చేసి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును వెలువరిచిన క్రమంలో ఇలాంటి నేరాలకు పాల్పడితే.. ఇక ఉరి శిక్ష విధిస్తారన్న హెచ్చరికలను వెలువరించింది. అయినా ఈ తీర్పు వెలువడిన వారం రోజులు లోపు మరో నిర్భయ ఘటనను మించిన దారుణ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. యువతిపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, తర్వాత ఆమె ముఖాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు ఆమె తలను ఛిద్రం చేసేశారు. అమె శరీర భాగాలను కూడా ముక్కలుముక్కలుగా నరికివేశారు.
ఈ ఘటన ఈ నెల 9న చోటుచేసుకోగా, నాలుగు రోజుల అలస్యంగా ఐఎంటీ ప్రాంతం నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత అలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. హర్యానా రాష్ట్రంలోని రోహ్‌తక్ ప్రాంతంలో ఓ యువతి విధులకు వెళ్తుండగా పలువురు దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి, అతి దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను గుర్తుపట్టడానికి వీలులేకుండా అమె తలపై నుంచి వాహనాలను నడిపి అత్యంత క్రూరంగా వ్యవహరించారు.
అప్పటికీ శాంతించని దుండగులు యువతి శరీర భాగాలను ముక్కలుముక్కలుగా నరికేశారు. ముక్కలుగా పడిఉన్న ఆ మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఆ మహిళపై మొత్తం ఏడుగురు దుండగులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ఎట్టకేలకు దారుణానికి గురైన ఆ మహిళ గురించిన వివరాలు తెలుసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more