Techie arrested for molesting woman on BMTC bus అకతాయి టెక్కీ అటకట్టించిన యువతి..

Techie arrested for molesting woman on bmtc bus

Techie molested woman on BMTC bus, techie teasing woman, techie arrested on molesting charges, know your police station app, BMTC, Volvo, Madhusudhan Rao, ITPL, Iblur, Bengaluru Metropolitan Transport Corporation

A software engineer was arrested for allegedly molesting a woman in a moving bus on Outer Ring Road near Bellandur.

అకతాయి సాప్ట్ వేర్ ఇంజనీరు అటకట్టించిన యువతి..

Posted: 05/13/2017 04:36 PM IST
Techie arrested for molesting woman on bmtc bus

అతని పేరు మధుసూధన్ రావు, అతనో సాప్ట్ వేర్ ఇంజనీరు. నీటుగా టక్కు వేసుకుని ఏసీ వోల్పో బస్సలో ప్రయాణిస్తున్నాడు. అయితే అతని బుద్ది మాత్రం వంకర. రమారమి 50 ఏళ్ల వయస్సున్న ఈయన.. తన కూతురి వయస్సున్న అమ్మాయిని చూసి చొంగ ఖార్చుకున్నాడు. సరేలా చూసినంత మాత్రాన ఏం జరుగుతుంది అనుకుంటున్నారా..? అక్కడితో అగని ఇంజనీరు అమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. యువతి వెనుక సీట్లో కూర్చున్న ఇంజనీరు సీట్ల మధ్యలో ఖాళీగా వుండే స్థలాన్ని అసరాగా చేసుకుని అమె పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

రద్దీగా ఉన్న‌ బస్సులో అందరిముందు పరువు తీస్తే బాగోదనుకుని కొంత సంయమనం పాటించిన యువతికి చిర్రెత్తుకొచ్చింది. ఊరుకున్న కొద్ది మరీ దారుణంగా ప్రవర్తిస్తున్న ఇంజనీరు.. అమెను అసభ్యంగా తాకడం ప్రారంభించి, చికాకు తెప్పించాడు. అయితే అప్పటికే రెండు పర్యాయాలు సున్నితంగా చెప్పినా.. అ పోకిరి ఇంజనీరు వినిపించుకోలేదు. నిసిగ్గుగా మళ్లీ మళ్లీ అదే పనులకు పాల్పడ్డాడు. ఇక అతడి చేష్టలకు చెక్ పెట్టాలని భావించిన యువతి.. కొత్తగా కర్ణాటక ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన సాంకేతికతను వినియోగించుకుని అకతాయి అటకట్టించింది.

యువ‌తుల‌కు ర‌క్ష‌ణ‌గా బెంగళూరు పోలీసులు ఇటీవల ‘Know your police station’ (మీ పరిధిలోని పోలిస్ స్టేషన్ తెలుసుకోండి) అనే యాప్‌ను ప్రారంభించడంతో అప్పటికప్పుడు ఆ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న యువతి.. దాని ద్వారానే పోలీసులకు పిర్యాదు చేసింది.  ఇంకేముందు తక్షణం స్పందించిన పోలీసులు 15 నిమిషాల్లో పిర్యాదు చేసిన యువతి సెల్ ఫోన్ నెంబరును ట్రాక్ చేస్తూ అమె వెళ్తున్న బస్సును నిలిపివేశారు. జీవు దిగిన పోలీసులు యువతితో మాట్లాడి.. వెనువెంటనే అమె వెనుక సీట్లో వున్న పోకిరి ఇంజనీరును అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు ఎందుకు వచ్చారు..? బస్సను ఎందుకు అపారు..? నీటుగా కనబడుతున్న ఇంజనీరును ఎందుకు అదుపులోకి తీసుకున్నారో.. బస్సులోని ప్రయాణికులకు అర్థంకాక..? ఔరా ఏమీ ఈ చిత్రం అంటూ ముఖాలు పెట్టారు. పోలీసులు వెళ్లిన తరువాత యువత జరిగిన ఘటనను చెప్పడంతో.. బస్సులోని వారు యువతి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఇక బస్సులో వున్న మిగతా యువతలు కూడా వెంటనే నో యువర్ పోలిస్ స్టేషన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. అమ్మాయిల ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తోన్న పోకిరీల ఆట‌లు క‌ట్టించాలంటే ఆ యువ‌తిలా చేయాల‌ని అధికారులు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BMTC  Volvo  Madhusudhan Rao  ITPL  Iblur  Bengaluru Metropolitan Transport Corporation  

Other Articles