Drunken Actress Fight at shopping mall in Delhi షాపింగ్ మాల్ సిబ్బందిపై నటి దాడి..

Drunken bollywood actress brawl at shopping mall in delhi

Drunken Actress Fight at shopping mall in Delhi, Pooja Mishra abuses, Pooja Mishra assaults shoping mall staff, Delhi’s Karol Bagh shopping mall, Pooja MIsra, Actress, BIG Boss Fame, Drunken Actress, Shopping Mall, Delhi, bollywood

Model and actress Pooja Mishra is accused of assaulting staff of a store in Delhi's Karol Bagh area. Pooja Mishra claims that two men were trying to molest her and to thwart them she whipped out the gun.

ITEMVIDEOS: షాపింగ్ మాల్ సిబ్బందిపై బాలీవుడ్ నటి దాడి..

Posted: 05/11/2017 06:26 PM IST
Drunken bollywood actress brawl at shopping mall in delhi

వెండి తెరపై వెలిగిపోయే ఛాన్సులు అరుదుగా వస్తున్నాయని కలత చెందిందో ఏమో కానీ.. ఏకంగా నిజజీవితంలో నటించి.. మెప్పించాలని భావించినట్లుంది ఈ బాలీవుడ్ నటి. బిగ్ బాస్ లో రాణించి.. అదే ఫేమ్ తో సినిమా అవకాశాలను చేతబట్టిన మోడల్ పూజా మిశ్రా తన స్థాయిని మర్చిపోయి.. నానా హంగామా చేసింది. ఢిల్లీలోని ఓ షాపింగ్ మాల్ లోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు అక్కడి సిబ్బంది చెంప చెల్లుమనిపిస్తూనే వేరే వ్యక్తితో ఫోన్ లో మాట్లాడింది. అలా రెండు పర్యాయాలు దాడి చేసిన తరువాత తమవాళ్లను ఎందుకు అకారణంగా దాడి చేస్తున్నావన్న సిబ్బంది అమెను దాడి చేయకుండా తేసివేయగా, కాలితో తన్ని.. ఫోన్ ను పక్కన పడేసి వారితో ఏకంగా ఘర్షణకు దిగింది.

వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో గల ఓ షాపింగ్ మాల్ లోకి వెళ్లిన పూజా మిశ్రా.. అక్కడి సిబ్బందితో వాదనకు దిగింది. ఈ క్రమంలో అమెతో వచ్చిన వారు అమె వాదనకు దిగడం ప్రారంభించగానే మొబైల్ ఫోన్ అన్ చేసి ఈ ఘటనను చిత్రీకరించడం ప్రారంభించారు. అప్పటి వరకు ఏదో పరద్యానంగా వున్న మిశ్రా ఒక్కసారిగా వారి వైపు తిరిగి.. తన సెల్ ఫోన్ తీసి.. ఎవరికో కాల్ చేసి.. ఇద్దరు ఆగంతకులు తనపట్ల అసబ్యంగా ప్రవర్తిస్తున్నారని, లైంగిక వేదింపులకు పాల్పడుతున్నారని చెప్పింది.

ఇంతలో అమెతో వాదిస్తున్న సిబ్బంది ఇది పూర్తిగా తప్పు. అలా చెప్పకూడదని చెబుతున్నా పెడచెవిన పెట్టి మరీ వారిపై విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలో ఒక వ్యక్తి ఫోన్ వద్దకు వచ్చి.. అమె చెప్పినదంతా అబద్దం అని చెప్ప ప్రయత్నం చేస్తుండగానే అతడ్ని చెంప చెల్లుమనిపించింది. అయినా ఆ వ్యక్తి దానిని లక్ష్యపెట్టకుండా అమెకు దూరంగా జరిగాడు. అయినా వదలని మిశ్రా సినిమాలో ఫీట్లు చేసినట్లుగా మళ్లి చెంప చెల్లుమనిపించింది. ఇలా రెండు పర్యాయాలు జరిగిన తరువాత మరో సహ సిబ్బంది వచ్చి అమెను నెట్టడంతో అమె తన కాలితో అతడ్ని తన్నింది.

ఇక ఫోన్ పక్కన బెటి.. వాళపై కలియబడి మరీ ఘర్షణకు దిగింది. ఇలా జరగ్గానే ఇక అక్కడ నుంచి బయలుదేరుతూ అంతా మొబైల్ లో కప్చార్ చేశావా అంటూ తనతో వచ్చిన వ్యక్తిని అడిగింది. ఇక ఈ వీడియోను తానే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిందని కూడా టాక్ వస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ఒకనాటి సినీనటుడు ఎంతో హుందాగా సభ్య సమాజంలో నడుచుకునే వారు కానీ నేటి తరం వారు మాత్రం తామే సమాజమన్నట్లు వ్యవహరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pooja MIsra  Actress  BIG Boss Fame  Drunken Actress  Shopping Mall  Delhi  bollywood  

Other Articles