Sonia Gandhi reaches out to Mamata Banerjee అనారోగ్యాన్ని పక్కనబెట్టి.. మమతకు సోనియా పోన్

Sonia gandhi seeks mamata s support ahead of presidential poll

Sonia Gandhi, Mamata Banerjee, Presidential Election, Sitaram Yechury, Nitish Kumar, Sharad Pawar, Opposition, President Pranab Mukherjee opposition president candidate, president election, pranab mukharjee, congress politics, BJP, PA sangma, politics

Congress president Sonia Gandhi is seeking the support of Mamata Banerjee and other opposition leaders ahead of the Presidential election in July. Mrs Gandhi is leading the opposition's mission to field a candidate.

అనారోగ్యాన్ని పక్కనబెట్టి.. మమతకు సోనియా పోన్

Posted: 05/10/2017 06:02 PM IST
Sonia gandhi seeks mamata s support ahead of presidential poll

అనారోగ్యం బారిన పడినా.. కాంగ్రెస్ ఉనికిని చాటుకునే క్రమంలో అధినేత్రి సోనియాగాంధీ.. తీవ్రంగానే శ్రమిస్తున్నారు. గత కొన్నాళ్లుగా క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా వున్న అమె.. అనారోగ్యం కారణంగా ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలలోనూ ప్రచార బాధ్యతలను తన భుజాలపై వేసుకోలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ తన ఉనికి చాటుకోవాలంటూ ప్రస్తుతం రాబోతున్న రాష్ట్రపతి ఎన్నికలే సరైనవని అమె భావిస్తున్నట్లున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికలలో అభ్యర్థిని నిలుపుతామని స్పష్టం చేసిన కాంగ్రెస్.. ఈ ఎన్నికల నేపథ్యంలో బీజేపికి గట్టిపోటీనివ్వాలని భావిస్తున్నారు.

అందుకోసం అనారోగ్యం ఓ వైపు వేదిస్తున్నా లక్ష్యపెట్టని అధినేత్రి సోనియా గాంధీ.. మెల్లిగా పావులను కదుపుతున్నారు. బీజేపి వ్యతిరేక శక్లులన్నింటినీ ఏకం చేస్తూ.. అందరి మద్దతును సోనియా కూడగట్టుకునే పనిలో వున్నారు. ఇందులో భాగంగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మరాఠా రాజకీయ భీష్ముడు శరద్ పవార్ తదితరులను సోనియా ఇప్పటికే కలిశారు. మరోవైపు  రాహుల్ గాంధీ కూడా సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌లను కలిశారు  ఇక తాజాగా సోనియాగాంధీ అసుపత్రి నుంచే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫోన్ చేశారు.

సోమవారం ఢిల్లీ వస్తే.. ఒక సమావేశం నిర్వహించుకుందామని మమతతో సోనియా చెప్పినట్లు సమాచారం. రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని ఎలాగైనా నిలబెట్టాలన్నది ఆమె వ్యూహంగా కనిపిస్తుంది. అయితే సోమవారం రోజు మమత బెనర్జీతో సమావేశం జరిపి అమె మద్దతు కూడా కూడగట్టుకోవాలని సోనియా భావిస్తున్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని సొంతంగా బరిలో నిలుపుతామని బీజపి స్పష్టం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా శరవేగంగా పావులు కదుపుతుంది. గత రాష్ట్రపతి ఎన్నికలలో ఫీఏ సంగ్మాకకు  మద్దతునిచ్చిన బీజేపి..  ఈ సారి కాంగ్రెస్ సహా ప్రత్యర్థి పార్టీల నుంచి మాత్రం తీవ్రపోటీని ఎదుర్కునే అవకాశాలున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles