Sekhar Reddy Bribed TN Ministers with 400 Crore Rupees

Sekhar reddy paid officials rs 400 crores

J Sekhar Reddy, Sekhar Reddy Bribe, Mining Baron Sekhar Reddy, Mining Baron Ministers, Sekhar Reddy Scam, Sekhar Reddy Ministers, Tamil Nadu Ministers Mining Mafia, 400 Crores Ministers, J Sekhar Reddy TN Ministers, Palaniswamy Sekhar Reddy Links, Palaniswamy Ministers Sekhar Reddy, TN Ministers Bribe

Tamil Nadu Mining Baron J Sekhar Reddy paid Rs 400 crores Bribe to Officials. The Income Tax department is said to have told the state government in a report.

జస్ట్ మంత్రుల కోసమే 400 కోట్ల లంచం

Posted: 05/08/2017 01:17 PM IST
Sekhar reddy paid officials rs 400 crores

తమిళనాడులో కల్లోలం రేపిన టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు జే శేఖర్ రెడ్డి వ్యవహారం మరో టర్న్ తీసుకుంది. ఇసుక మాఫియా రారాజుగా ఎదిగే క్రమంలో ఏకంగా మంత్రులకే 400 కోట్లు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్నుశాఖ ఈ మేరకు ప్రభుత్వానికి అందించిన నివేదికలో దీనిపై వివరణ ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసులను ఎదుర్కొంటున్న జే శేఖర్ రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ అధికారులకు రూ. 400 కోట్ల మేరకు ముడుపులు ఇచ్చినట్టు అధికారులు పేర్కొన్నారంట. గత సంవత్సరం నోట్ల రద్దు తర్వాత డిసెంబరులో ఆదాయపు పన్ను అధికారులు శేఖర్ రెడ్డి ఇంటిపై దాడులు చేసినప్పుడు రూ. 34 కోట్ల కొత్త రెండు వేల రూపాయల నోట్లు సహా రూ. 142 కోట్లను రికవరీ చేసిన సంగతి తెలిసిందే.

పన్ను ఎగవేత కేసులో సీబీఐ కేసు నమోదు కాగానే ఈ దాడులు జరిగాయి. ఆపై జైలుకెళ్లిన శేఖర్ రెడ్డికి 87 రోజుల అనంతరం బెయిల్ లభించగా, బయటకు వచ్చిన మూడు రోజులకే తిరిగి అరెస్టై జైలుకు వెళ్లారు. ఇక ఈ తాజా నివేదిక విషయంలో విచారణకు ఆదేశించాలా? వద్దా? అన్నది ప్రభుత్వ నిర్ణయమని విచారణకు ఆదేశిస్తే, పళని కేబినెట్ లోని మంత్రులు కటకటాల వెనక్కు వెళ్లాల్సి ఉంటుంది. అలాకానీ పక్షంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  J Sekhar Reddy  Ministers Bribe  

Other Articles