IPS Charu Nigam strong comeback against MLA

After mla shout lady ips says she is not coward

Lady IPS Officer Tears, IPS Officer Tears, BJP MLA Shout, BJP MLA Lady IPS, Charu Nigam Tears, Charu Nigam Strong Come Back, Charu Nigam Not Weak, Gorakhpur IPS Insult, IPS Rebuke, MLA Radha Mohan Das Agarwal , MLA Scold IPS, Lady Singha, Tears, Gorakhpur MLA IPS Officer, Don't Cross Limits IPS, Coward IPS Officer, MLA Shout Lady IPS, Charu Nigam IPS, MLA Dr Radha Mohan Das, Agarwal, Radha Mohan Das Charu Nigam

BJP MLA MLA Dr Radha Mohan Das Agarwal from Gorakhpur publicly tells off Lady IPS Officer for 'high-handedness', reduces her to tears. Later Charu speaks out says My training hasn't taught me to be weak.

ITEMVIDEOS:ఏడ్చినంత మాత్రానా పిరికిదాన్ని కాదు

Posted: 05/08/2017 02:38 PM IST
After mla shout lady ips says she is not coward

ఉత్తరప్రదేశ్ లో ఓ ఎమ్మెల్యే గట్టిగా గద్ధించిన వేళ, కన్నీరు పెట్టుకున్న ఐపీఎస్ అధికారిణి చారూ నిగమ్, తన ట్విట్టర్ ఖాతా ద్వారా గట్టిగా స్పందించింది. బీజేపీ ఎంఎల్ఏ రాధా మోహన్ అగర్వాల్ తనతో వాగ్వాదానికి దిగటంతో కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆ వీడియో నెట్ లో వైరల్ కావటంతో రాధా మోహన్ పై దుమ్మెత్తిపోయటం, చారూపై సానుభూతి చూపటం ప్రారంభమైంది.

అయితే తన కంట్లో నీరు వచ్చినంత మాత్రాన తాను బలహీనురాలిని కాదని, తాను తీసుకున్న శిక్షణ బలహీనతను నేర్పించలేదని అంటోంది చారూ నిగమ్. ఈ మేరకు తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ ఉంచింది. ఎస్పీ గణేష్ సాహా అక్కడికి వచ్చిన తరువాత, అంతకుముందు జరిగిన ఘటనపై మనస్తాపం చెందానని, అందువల్లే కన్నీరు పెల్లుబికిందని అన్నారు. మహిళలు నిరసన తెలుపుతున్న సమయంలో అక్కడున్న సీనియర్ అధికారిని తానే కాబట్టి నిరసనకారులను పక్కకు లాగాలని నిర్ణయించానని, కానీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను చిత్రీకరించి, ప్రజలకు వాస్తవాలను తెలియజేసిన మీడియాకు కృతజ్ఞతలని పేర్కొంది.

 

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్ పూర్ లో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఈ ప్రాంతంలో అక్రమ మద్యం అధికంగా ఉందని, దాన్ని నివారించాలని డిమాండ్ చేస్తూ, మహిళలు రాస్తారోకోకు దిగిన వేళ, పరిస్థితి విషమించడంతో మహిళా పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. నిరసన చేస్తున్న మహిళల్లో కొందరు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో, లాఠీచార్జ్ చేయగా కొంతమంది మహిళలకు గాయాలు అయ్యాయి.

విషయం తెలుసుకున్న గోరఖ్ పూర్ ఎమ్మెల్యే, సీనియర్ నేత డాక్టర్ రాధామోహన్ దాస్ అగర్వాల్ అక్కడికి చేరుకున్నారు. అక్కడే విధుల్లో ఉన్న 2013 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి, గోరఖ్ పూర్ లో శిక్షణలో ఉన్న చారూ నిగమ్ అనే పోలీసు అధికారిణి ఆయనకు టార్గెట్ అయింది. ఆమెతో వాగ్వాదానికి దిగిన రాధామోహన్ దాస్, నువ్వు హద్దులు దాటొద్దంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. వీడియోల్లో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం, "నేను నీతో మాట్లాడటం లేదు. నాకేమీ చెప్పొద్దు. నోర్ముయ్. హద్దులు దాటొద్దు" అంటూ పదేపదే అరిచారు. తానిక్కడ ఇన్ చార్జ్ అధికారినని, తానేం చేస్తున్నానో తనకు తెలుసునని చారూ నిగమ్ చెబుతున్నా ఆయన వినలేదు. ఎమ్మెల్యే కేకలకు చారూ నిగమ్ కళ్ల వెంబడి నీళ్లు వచ్చాయి. ఓ హ్యాండ్ కర్చీఫ్ తో ఆమె కళ్లు తుడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  Lady IPS  Gorakhpur MLA  Charu Nigam  

Other Articles