Separate Trial against Lalu in Fodder Scam

Sc orders separate trial in four cases against lalu

Supreme Court,Lalu Prasad Yadav, Fodder Scam, Fodder Scam Lalu Prasad Yadav, CBI Lalu Prasad Yadav, Fodder Scam Lalu Prasad Yadav, Separate Trial Lalu Prasad Yadav, SC Shock Lalu, Lalu Fodder Scam, Fodder Scam Lalu Bail

Supreme Court Allows CBI's Plea Against Dropping Of Charges Against Lalu Prasad Yadav in Fodder Scam.

దాణా కేసు: లాలూకి సుప్రీం షాక్

Posted: 05/08/2017 10:55 AM IST
Sc orders separate trial in four cases against lalu

సుప్రీంకోర్టులో ఆర్జేజీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు చుక్కెదురైంది. దాణా స్కాంలో వేర్వేరే కేసులో విచారణ వేగవంతం చేయాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. దీిని ప్రకారం లాలూ ప్రత్యేక విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. తొలుత బెయిల్ కూడా రద్దు చేసి అరెస్ట్ కు ఆదేశిస్తుందని అనుకున్నప్పటికీ అలా జరగలేదు.

1990-97 మధ్య కాలంలో పశువుల దాణా పేరిట ఏకంగా రూ.9,400 కోట్లను లాలు జీర్ణం చేసుకున్నారని రుజువైంది. ఈ కేసులో ఆయనకు శిక్ష పడింది. అయితే ఈ కేసులో ఉన్న మిగిలిన వారు బెయిలుపై బయట ఉన్నారని, తనకు కూడా ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో 2013లో లాలుకు బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో ఆయనను దోషిగా నిర్ధారించిన హైకోర్టు ఇందులో కుట్ర జరిగిందనే వాదనను తోసిపుచ్చి ఆ అభియోగాలను కొట్టివేసింది. దీంతో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ కేసులో వాదనలు ముగియటంతో సోమవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మరోవైపు జైలులో ఉండాల్సిన లాలు ప్రసాద్ యాదవ్ జైలులో ఉన్న మరో వ్యక్తి (మాఫియా డాన్ షహబుద్దీన్)తో మాట్లాడి ఆయన ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తానని చెప్పడం షరతులను ఉల్లంఘించడమే అయినప్పటికీ బెయిలు రద్దు గురించి ప్రస్తావన రాకపోవటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fodder Scam  Lalu Prasad Yadav  Supreme Court  Separate Trial  

Other Articles