Candidate Asked to Remove Bra to Attend NEET

Dress code clause of neet makes many candidates nervous

NEET, NEET Dress Code Clause, NEET Bra Remove, NEET Sleeveless, NEET Girl Crying, NEET Troubles, NEET Exam Dress Code, NEET candidate, NEET Last Minute Checklist, Girl Strip NEET Exam, NEET Exam 2017, Kerala Bra Remove, Exa Inspection Strip, NEET Exam Strip

NEET turns dress code horror, girl allegedly forced to remove innerwear before exam. In Tamil Nadu to cut off sleeves, remove jewellery.

అమ్మాయి.. బ్రా విప్పాకే లోపలికి వెళ్లు!

Posted: 05/08/2017 07:23 AM IST
Dress code clause of neet makes many candidates nervous

డ్రెస్ కోడ్ నిబంధనంతో ఆదివారం నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష (నీట్)కు హాజరైన విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పాలయ్యారు. ముఖ్యంగా విద్యార్థినులకు టైం దగ్గర పడినా కొద్ది ఒక్కో కారణం చెబుతూ అధికారులు చుక్కలు చూపించారు. ఒకటి కాదు రెండు కాదు... దాదాపు ప్రతీ రాష్ట్రంలోనూ అభ్యర్థులను ఇబ్బందిపాలు చేయటమే లక్ష్యంగా పెట్టినట్లు ఉందని పలువురు పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు.

కేరళలోని కన్నరూలో పరీక్షా కేంద్రానికి వెళ్లిన ఓ విద్యార్థిని బ్రా ధరించడంతో పరీక్ష రాసేందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. దానిని తొలగించి వస్తేనే పరీక్ష రాసేందుకు అనుమతిస్తామని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. చేసేది లేక దానిని తొలగించి లొపలికి వెళ్లింది. పరీక్ష హాలు నుంచి కంగారుగా బయటకు పరుగెత్తుకుంటూ వచ్చిన తన కూతురు చేతిలో టాప్ ఇన్నర్ వేర్ పెట్టి మళ్లీ అంతే వేగంగా లోపలికి వెళ్లిపోయిందని విద్యార్థిని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. పరీక్ష పూర్తియిన అనంతరం విద్యార్థిని కూడా ఏడుస్తూ ఈ విషయాన్ని మీడియాకు తెలియజేసింది.

ఇక కర్ణాటక లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో ఓ విద్యార్థినికి దాదాపు ఇదే రకమైన అనుభవం . పరీక్ష మరో 30 నిమిషాలు ఉందనగా చవెి రింగులు తీయాలని అధికారులు ఆదేశించారు. దీంతో కంగారు పడిన యువతి వాటిని తొలగించే తరుణంలో పోగు స్క్రూ ఇరుక్కుపోవటంతో నానా తంటాలు పడింది. ఇక తెలంగాణలో అల్వాల్ ఓ పరీక్ష కేంద్రానికి హాజరైన యువతుల ముక్కుపుడకలు కూడా తీయించేశారు. చెన్నైలో ఓ పరీక్ష కేంద్రానికి ఫుల్ స్లీవ్ తో(హాఫ్ స్లీవ్ మాత్రమే ఉండాలని రూల్) వచ్చిన అభ్యర్థుల బట్టలను అధికారులే దగ్గరుండి చించేయటం విశేషం.

కుర్తాపైజామాలు ధరించొద్దని, ఇన్నర్ వేర్ లు వేయొద్దని, బ్లాక్ పాయింట్, ఫుల్ స్లీవుల నిషేధం, షూలపై బ్యాన్.. ఇలా చివరి నిమిషంలో నీట్ డ్రెస్‌కోడ్ క్లాజ్ పేరుతో పలువురు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు గురిచేయగా, ఇదసలు ‘నీట్’ గా లేదని పలువురు మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NEET Exam 2017  Dress Code  Girl Strip  

Other Articles