Pilot takes a nap with 300 on board గాల్లో విమానం.. 2 గంటలపాటు పైలట్ కునుకు..

Pakistan international airlines pilot sleeps on flight risks 300 lives

Pakistan International Airlines, senior pilot nap, pilot sleeping on flight, pilot risked 300 passengers lives ,Airline, Karachi, Pakistan, PIA, pilot, World

Pakistan International Airlines has taken its senior pilot off-duty for allegedly sleeping on a London-bound flight, risking the lives of over 300 passengers on board by handing over the aircraft to a trainee.

గాల్లో విమానం.. 2 గంటలపాటు పైలట్ కునుకు..

Posted: 05/07/2017 03:22 PM IST
Pakistan international airlines pilot sleeps on flight risks 300 lives

విమానాలు ఇటీవల కాలంలో ఎదుర్కొంటున్న ప్రమాదాలతో విమానయానంపై కూడా నమ్మకాలు సన్నగిల్లుతున్న తరుణంలో అలాంటి వాటికి చెక్ పెడుతూ.. విమాన ప్రయాణంపై భరోసా ఇవాల్సిన పెలైట్లు..  అందుకు బదులు ప్రయాణికులను మరింత అందోళనకు గురిచేసే చర్యలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో పైలట్లపై విమర్శలు కూడా వెల్లివిరుస్తున్నాయి. కొందరు మద్యం సేవించి విమానం నడిపేందుకు వస్తున్నారని, మరికొందరు తమ కాక్ పిట్ లోకి పోర్న్ స్టార్లను అనుమతించడం వంటి ఘటనల నేపథ్యంలో విమర్శనలు ఎదుర్కోంటున్నారు.

తాజాగా పాకిస్థాన్ అంతర్జాతీయ విమాన పైలట్ తన విధులను ఓ ట్రైనీ పైలట్ కు ఇచ్చి సుమారు 300 మంది ప్రయాణికుల ప్రాణాలను పనంగా పెట్టి.. తాను మాత్రం సుఖంగా నిద్ర‌లోకి జారుకున్నాడు. ఆయనే అమిర్ అక్త‌ర్ హ‌ష్మీ. ఈయ‌న పాకిస్తాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌లైన్స్‌లో సీనియ‌ర్ పైలెట్‌. అయితే అయన సీనియ‌ర్ మాత్రమే కాదు పైలట్ అసోషియేషన్ సంఘానికి అధ్యక్షుడు కూడా. దీంతో తనను ఎవరేం అంటారని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ విమానం గాలిలో వుండగా ఎంచక్కా రెండున్నర గంటల పాటు కునుకు తీసి వార్తల్లో నిలిచాడు.

వివరాల్లోకి వెళ్తే.. 300 మంది ప్ర‌యాణికులతో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ నుంచి లండ‌న్‌కు వెళుతున్న విమానానికి పైలట్ బాద్యతలు చేపట్టాల్సిన అమిర్ అక్త‌ర్ హ‌ష్మీ.. టేకాఫ్ చేసిన తరువాత విమానం గాల్లో వుండగా.. తన బాధ్య‌త ట్రైనీ పైలెట్‌కు అప్ప‌గించి.. ఆయన మాత్రం ఏకంగా అదే విమానంలో బిజినెస్ క్లాస్ కేబిన్‌లో రెండున్న‌ర్ర గంట‌ల‌పాటు గురుక తీశాడు. అలా ఆయ‌న నిద్రిస్తున్న స‌మ‌యంలో ఓ ప్ర‌యాణికుడు ఫోటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం వైర‌ల్ అయ్యింది. అంతటితో అగని ప్రయాణికుడు ఈ ఫోటో అటు సోషల్ మీడియాలో పెట్టడంతో పాటు ఎయిర్‌లైన్స్ అధికారుల‌కు ఫిర్యాదు చేశాడు.

అయితే హ‌ష్మీపై చర్యలు తీసుకునేందుకు అధికారులు మీనమేశాలు లెక్కించారు. ఎందుకంటే అయన సీనియ‌ర్ పైలెట్ మాత్రమే కాదదు ఏకంగా పాకిస్తాన్ ఎయిర్‌లైన్ పైల‌ట్ అసోసియేష‌న్‌కు అధ్య‌క్షుడిగా ఉండ‌టంతో ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ అధికారులు ముందుగా భ‌య‌ప‌డ్డారు. అయితే పై స్థాయి అధికారులు విచార‌ణ‌కు ఆదేశించ‌డంతో కొంత క‌ద‌లిక వ‌చ్చింది. హ‌ష్మీ ఫ్లైయింగ్ లైసెన్స్‌ను ర‌ద్దు చేసి విచార‌ణ‌కు ఆదేశించింది ఎయిర్‌లైన్స్ సంస్థ‌. ట్రైనీకి ట్రైనింగ్ ఇవ్వ‌కుండా ఆ స‌మ‌యంలో నిద్ర‌కు ఉప‌క్ర‌మించినందుకు గాను హ‌ష్మీపౌ వేటు వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles