Wipro gets threatening letter demands Rs 500 crores విప్రోకు బెదిరింపు లేఖ.. రూ.500 కోట్ల డిమాండ్

Wipro gets bio attack threat email 500 crores in bitcoin demanded

Bharatiya Janata Party-Shiv Sena government,MP Ravindra Gaikwad,no-fly list,Ravindra Gaikwad,Shiv Sena, domestic airlines, airlines, domestic terminals, no fly list rules, shivsena mp, ravindra gaikwad, ashokgajapathi raju, news, India news, latest news

IT-giant Wipro received an anonymous email threat demanding Rs 500 crore worth currency in bitcoins as ransom, failing which a lethal drug would be spread on their Bengaluru campus

విప్రోకు బెదిరింపు లేఖ.. రూ.500 కోట్ల డిమాండ్

Posted: 05/06/2017 08:21 PM IST
Wipro gets bio attack threat email 500 crores in bitcoin demanded

భారత సాప్ట్ వేర్ దిగ్గజ సంస్థలను టార్గెట్ చేస్తూ బెదిరింపులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అగ్రరాజ్యంలో అక్కడి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలతో అక్కడి నుంచి భారతీయులు స్వదేశానికి పయనం అవుతున్న నేపథ్యంలో దేశంలోని సాప్ట్ వేర్ సంస్థలకు కూడా బెదిరింపులకు దిగుతూ మరో విధమైన అంధోళన రేకిస్తుంది. దీంతో దేశ ఐటీ రంగం భవిష్యత్తు ఏమిటోనన్న భయాందోళన ఉద్యోగులలో నెలకొంది. తాజాగా బెంగ‌ళూరులోని విప్రో ప్ర‌ధాన కార్యాలయానికి వచ్చిన బెద‌రింపు లేఖ ఐటీ సంస్థలతో పాటు ఐటీ నిపుణలను కూడా తీవ్ర కలవరానికి గురిచేస్తుంది.

బెంగళూరులోని విప్రో సంస్థ ప్రధాన కార్యాలయానికి వచ్చిన లేఖలో అగంతకులు తాము చెప్పిన అడ్రస్ కు ఏకంగా రూ.500 కోట్లు పంపాల‌ని పేర్కోన్నారు. లేని పక్షంలో ఆఫీసును పేల్చేస్తామ‌ని తెలుపుతూ గుర్తు తెలియ‌ని ఆగంత‌కుడు ఆఫీస్‌కు మెయిల్ పంపాడు. తాము విప్రో కార్యాలయంలో అల్లకల్లోలం సృష్టిస్తామని ఇందుకోసం ఒక రసాయనక పధార్థం కూడా సిద్దంగా వుందని అగంతకులు తమ లేఖలో పేర్కోన్నారు. తాము కోరిన విధంగా రూ. 500 కోట్ల రూపాయలను బిట్ కాయిన్ల రూపంలో చెల్లించాలని పేర్కోన్నారు.

అలా చేయని పక్షంలో తమ వద్ద వున్న కిలో రసాయనక పదార్థం రిసిన్ ను కార్యాలయానికి పంపుతామని, దాంతో విప్రో ఉద్యోగులందరూ ఉక్కిరిబిక్కిరై ప్రాణాలను వదులుతారని కూడా హెచ్చరించారు. ఈ బెదిరింపు లేఖ‌పై స్థానిక సైబ‌ర్ క్రైమ్ పోలీస్ స్టేష‌న్ లో విప్రో అధికారులు ఫిర్యాదు నమోదు చేశారు. సైబ‌ర్ టెర్ర‌ర్ చ‌ట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఈమెయిల్ ను ఒక వ్యక్తి పంపారని తెలుసుకున్నారు. ఇక అది ఎక్క‌డినుంచి వ‌చ్చిందో గుర్తించే పనిలో ప‌డ్డారు పోలీసులు. ఎవ‌రైన ఆక‌తాయిలు ఈ ప‌ని చేశారా అన్నా కోణంలో కూడా పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Wipro  bitcoins  e-mail threat  drug  software industry  Information technology  

Other Articles