Supreme Court Verdict In Nirbhaya Case Appeals Today

Supreme court to deliver verdict in nirbhaya case today

Supreme Court, Supreme Court Nirbhaya Case, Nirbhaya Case Verdict, Nirbhaya Case Convicts, Nirbhaya Case Death Sentence, Supreme Court Verdict, Supreme Court Rape Case Verdict, Supreme Court Nirbhaya, Para Medical Student Rape Case, Nirbhaya Gangrape Case, Nirbhaya Judgment, Nirbhaya Killers, Nirbhaya Gangrape Case Timeline, National News, Nirbhaya News, 2012 Nirbhaya Gangrape Case, December 16 2012

Supreme Court To Pronounce Verdict in Nirbhaya Case. Death Or Life For 4 Who Raped, Killed 23 Years Para Medical Student.

జడ్జిమెంట్ డే: నిర్భయ నిందితుల గతి ఏంటి?

Posted: 05/05/2017 10:29 AM IST
Supreme court to deliver verdict in nirbhaya case today

సుమారు ఐదేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీ నడివీధుల్లో అర్థరాత్రి జరిగిన పైశాచిక క్రీడ గుర్తే ఉండి ఉంటుంది. 23 సంవత్సరాల ఓ పారామెడికల్ విద్యార్థిని బస్సులో దారుణంగా అత్యాచారం చేసి ఆపై నడిరోడ్డుపై నగ్నంగా పడేసి ఆమె మరణానికి కారకులయ్యాయి నాలుగు మృగాలు. దేశం యువత మొత్తం ఒకేతాటిపైకి వచ్చి చేసిన పోరాటంతో చివరకు స్పందించిన కేంద్రం ఎట్టకేలకు వారిని కటకటాల వెనక్కి నెట్టడమే కాదు, కఠిన చట్టాలు రూపొందించేలా అడుగులు వేసింది.

'నిర్భయ' చట్టం ఆవిష్కరణకు నాంది పలికిన ఈ కేసులో నేడు సుప్రీంకోర్టు తన తుది తీర్పును వెలువరించనుంది. డిసెంబర్ 16, 2012న అక్షయ్ థాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్ లు బస్సులో ఓ యువతిని నిర్బంధించి గ్యాంగ్ రేప్ చేసిన ఘటనలో ట్రయల్ కోర్టు 2013లో మరణశిక్ష విధించగా, నిందితుల పిటిషన్ మేరకు సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపిన సంగతి తెలిసిందే. కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఉండగా, రామ్ సింగ్, తీహార్ జైల్లో మార్చి 2013లో ఉరివేసుకుని మరణించాడు.

మరో నిందితుడు నేరం చేసే సమయానికి మైనర్ కావడంతో, మూడేళ్ల శిక్షాకాలం తరువాత డిసెంబర్ 2015లో విడుదలయ్యాడు. నిర్బయ కేసు వెలుగులోకి వచ్చిన తరువాతనే, తీవ్రమైన నేరాల విషయంలో బాలనేరస్తుల వయసును 18 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలకు తగ్గిస్తూ కూడా చట్టంలో మార్పులు తీసుకువచ్చారు. ఇక ఈ కేసులో జస్టిస్ దీపక్ మిశ్రా, ఆర్.భానుమతిలతో కూడిన ధర్మాసనం నేడు తుది తీర్పును ఇవ్వనుంది. ఒకవేళ కోర్టు ఉరిని ఖరారు చేస్తే మాత్రం వాళ్లకు మిగిలేది రాష్ట్రపతి క్షమాభిక్ష మాత్రమే. ఉరి శిక్ష లేక జీవిత ఖైదా? అన్నది మధ్యాహ్నానికే తేలిపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nirbhaya Case  Supreme Court Verdict  Death Sentence  Life Punishment  

Other Articles