Patanjali Confirmed Using Cow Urine in Products

Cow urine is used in patanjali products

Baba Ramdev Cow Urine, Baba Ramdev Patanjali, Patanjali Products, Baba Ramdev Patanjali Meeting, Patanjali Sensational Announcement, Patanjali Cow Urine, Cow Urine Patanjali Products, Patanjali Products Contains, Patanjali Annunal Turn Over, Baba Ramdev's Patanjali Group, Patanjali Annual Press Conference, Cow Urine Confirmed Patanjali

Baba Ramdev Sensational Statement on Patanjali Annual Press Conference at Haridwar. Cow urine is used in Five Products Only.

యస్.. పతంజలిలో ఆవు మూత్రం కలుపుతున్నాం

Posted: 05/05/2017 09:55 AM IST
Cow urine is used in patanjali products

కెమికల్స్ కలుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కార్పొరేట్ కంపెనీలకు ధీటుగా పతంజలి ఉత్పత్తులను రూపొందించినట్లు యోగా గురువు బాబా రాందేవ్ ప్రతీ మీటింగ్ లోనూ చెబుతుండటం చూస్తున్నాం. స్వచ్ఛమైన ఆయుర్వేదిక్ మూలికలతో తమ ఉత్పత్తులను వాడితే ఆరోగ్యం మీ చెంతకే చేరుతుందంటూ టీవీల్లో యాడ్ లతో ఊదరగొట్టడం తెలిసిందే. అన్ని వర్గాల ప్రజలు ఎగబడిపోతున్న వాటి ఉత్పత్తులకు ఇప్పుడు ఉన్నంత గిరాకీ అంతా ఇంతా కాదు.

తమ ప్రొడక్టులలో వాడే అసలు దివ్య ఔషధం ఏంటో చెబుతూ వార్షికోత్సవ సభలో సంచలన ప్రకటనే చేశాడు రాందేవ్. పతంజలి ఉత్పత్తులు అన్నిట్లోనూ గోమూత్రం కలుపుతున్నారంటూ ఈ మధ్య కొందరు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అది నిజమేనని ప్రకటించాడు. అయితే తాము కేవలం ఐదు ఉత్పత్తుల్లోనే గో మూత్రం వినియోగిస్తున్నామని చెప్పాడు. గోమూత్రం అన్నింట్లో కలుపుతామంటూ దుష్ఫ్రచారం చేస్తూ ఓ వర్గం వారిని తమ ఉత్పత్తులను వాడకుండా చేస్తున్నారంటూ
ఆవేదన వ్యక్తం చేశాడు.

అంతేకాదు ఏయే ఉత్పత్తుల్లో గో మూత్రం కలిపామన్న విషయాన్ని వాటి ప్యాకెట్లపై స్పష్టంగా పేర్కొంటున్నామని తెలిపాడు. కేన్సర్ నివారణ కోసం తాము తయారు చేసిన పంచ గోయ మందులో గోమూత్రం కలిపామని ఆయన వెల్లడించారు. కాగా, ఆ మధ్య పతంజలి యోగా తయారు చేసిన నూడుల్స్ లో బూడిద వినియోగించినట్టు గతంలో పరీక్షల్లో తేలగా... తాజాగా గోమూత్రం వినియోగిస్తున్నారంటూ కొందరు ఆరోపణలు చేశాడరు. ఇక ఇప్పుడు గోమూత్రం ప్రకటన వల్ల సంస్థ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెటింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baba Ramdev  Patanjali  Cow Urine  

Other Articles