youth gets one year jail term for grabbing girls hand వెంటపడి.. విసిగించి.. ‘‘ఐ లవ్ యు’’ చెబితే..

Youth gets one year jail term for grabbing girls hand

case against youth for saying i love you, case aganist youth for grabbing teen's hand, dindoshi court, youth sentenced for one year, khadse, POCSO, Youth gets 1-year jail, man grabbing a woman's hand, I Love You, grabbing teen's hand

A man grabbing a woman's hand in public and saying "I love you" can be defined as outraging her modesty, court made the observation while sentencing a 22-year-old man to one year in jail for accosting a 16-year-old girl

వెంటపడి.. విసిగించి.. ‘‘ఐ లవ్ యు’’ చెబితే..

Posted: 05/04/2017 03:27 PM IST
Youth gets one year jail term for grabbing girls hand

16 ఏళ్ల మైనర్ బాలికను నలుగురిలో నిలవరించడమే కాక చేయిపట్టి లాగి ఐ లవ్ యు అని చెప్పిన ఓ యువకుడు ఏడాది పాటు కటకటాల వెనక్కి వెళ్లాడు. అలా నలుగురిలో బాలికతో అసభ్యంగా ప్రవర్తిచి.. నిలువరించడం లైంగికపరమైన చర్యగానే న్యాయస్థానం పరగనించింది. లైంగికపరమైన నేరాల నుంచి బాలికలకు ప్రత్యేక రక్షణ కల్పించే చట్టం(పోస్కో యాక్ట్‌) ద్వారా 22 ఏళ్ల యువకుడికి శిక్షను ఖారారు చేసిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. మైనర్ బాలికలకు ఐ లవ్ యు అని చెప్పడం కూడా నేరమేనని న్యాయస్థానం అభిప్రాయపడింది.

కాగా, సదరు యువకుడు.. నిత్యం ఆ బాలికను అనుసరిస్తూ చెడుగా ప్రవర్తించేవాడని, అసభ్యకరంగా మాట్లాడేవాడని, ఒంటరిగా వెళ్లాలంటే భయం వేసేలా యువకుడి చర్యలు వుండేవని పేర్కొంటూ నిందితుడిపై బాధితురాలి పిర్యాదు మేరకు పోలీసులు మోపిన అభియోగాలు నిరూపితం కాకపోవడంతో ఆ ఆరోపణలు న్యాయస్థానం కొట్టేసింది. కాగా, ఈ కేసు దర్యాప్తును నెమ్మదిగా కొనసాగించడం పట్ల పోలీసుల తీరుపై కూడా న్యాయస్థానం అసహనాన్ని వ్యక్తం చేసింది. పోలీసులకు అక్షింతలు కూడా వేసింది.

అయితే ఈ కేసును నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని కూడా కోర్టులో హజారుపర్చి రిమాండ్ కు తరలించారు. దీంతో అక్టోబర్‌ 29, 2015 నుంచి బెయిల్‌ పొందిన అక్టోబర్‌ 19, 2016వరకు దోషిగా తేలిన యువకుడు జైలులోనే గడిపాడు. తాజాగా కోర్టు కూడా ఏడాదికాలం శిక్ష విధించింది. అయితే ఇప్పటికే ఆ మేరకు శిక్షను అనుభవించిన నేపథ్యంలో దోషిగా తేలిన ఖాడ్సే శిక్షకాలం దాదాపు పూర్తయినట్లు ప్రకటించే అవకాశం ఉంది.

2015 అక్టోబర్‌ 6న ఖడ్సే అనే యువకుడు 16 ఏళ్ల యువతి తన స్నేహితురాలితో కలిసి కాలేజీకి వెళ్లొస్తుండగా మధ్యలో వారిని అడ్డుకుని.. ఇబ్బందికర చర్యలకు పాల్పడ్డారు. అసభ్యంగా మాట్లాడాడు. అంతటితో అగకుండా అమె చేయి పట్టి లాగి.. ‘ఐ లవ్‌ యూ’ అనేశాడు. అవమానాన్ని తట్టుకోలేక ఇంటికెళ్లిన యువతి విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పింది. తల్లిదండ్రులు విషయాన్ని ఖాడ్సే తల్లిదండ్రులకు చెప్పి మందలించే ప్రయత్నం చేసినా.. వారు తమ బిడ్డను వెనకేసుకుని రావడంతో గత్యంతరం లేని పరిస్తితుల్లో పోలీసులను అశ్రయించి కేసు నమోదు చేశారు. దీంతో ఆ యువకుడు ఏడాది కాలం పాటు జైలు శిక్ష్ అనుభవించాల్సి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : khadse  grab  i love you  teen's hand  one year jail  crime  

Other Articles