ముఖ్యమంత్రిని ముక్కలుగా చంపుతాం.. Khalistanis Threaten CM Amarinder singh

Khalistani elements publicly threaten punjab cm amarinder singh

Khalistanis Threaten punjab CM, Khalistanis Threaten amarinder singh, Khalistanis Threatens publicly, Punjab, Khalistani activists, Inderjit Singh Bains, harjit singh sajjan, Amarinder Singh, punjab cheif minister, canada, Captain Amarinder Singh, Khalistani movement, KPS Gill

A threat publicly issued to Punjab Chief Minister Amarinder Singh by pro-Khalistan elements during an event in Surrey city of Canada's British Columbia province recently has drawn an official protest from India.

‘‘బియంత్ లా నిన్ను ముక్కలుగా చంపుతాం’’ సీఎంకు ఉగ్రవాదుల హెచ్చరికలు

Posted: 05/04/2017 01:28 PM IST
Khalistani elements publicly threaten punjab cm amarinder singh

పంజాబ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందకు నడుంచుట్టిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఆయనను హతమారుస్తామని బహిరంగంగా హెచ్చరికలు పంపుతున్నారు. కెనడాలో అశ్రయంపోందుతున్న ఖలిస్తాన్ ఉగ్రవాదులు అక్కడి నుంచే అమరీందర్ సింగ్ ను చంపుతామంటూ బెదిరింపు మెసేజ్ లను వరుసపెట్టి పంజాబ్ కు పంపుతున్నారు. "కెప్టెన్! అమరీందర్ సింగ్ గుర్తుపెట్టుకోండీ.. మీ పార్టీకి చెందిన మాజీ సీఎం మాదిరిగానే మిమల్నీ చంపుతాం’’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ ను కారు బాంబు అమర్చి చంపడంతో ఖలిస్తాన్ ఉగ్రవాదులు అప్పట్లో ఉనికి చాటుకున్నారు. అయితే తాజాగా అమరీందర్ విషయంలోనూ అదే రిపీట్ వుతుందని.. అతని మాదిరిగానే అంత్యక్రియలను నిర్వహించుకోవడానికి మృతదేహం ముక్కలను ఏరుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇలా వరసపెట్టి వస్తున్న అడియో మెసేజ్ లను కెప్టన్ అమరీందర్ చాలా లైట్ గా తీసుకుంటున్నారు.

కాగా పంజాబ్ కు చెందిన వ్యక్తి కెనడా రక్షణ మంత్రి  హర్జిత్ సజ్జన్.. స్వదేశ పర్యటనకు రాగా, అతనితో అమరీందర్ కలవాల్సి వుంది. అయితే అతను కూడా ఖలిస్తాన్ ఉగ్రవాద అనుకూల వ్యక్తేనని భావించిన అమరీందర్ అతనితో భేటీకి విముఖత వ్యక్తం చేశారు. దీంతో తమ రక్షణ మంత్రిని కూడా ఉగ్రవాది అని వ్యాఖ్యానించిన మీకు నిజంగా దమ్ముంటే కెనడా రావాలని హెచ్చరించారు. కెనడా నుంచే మీకు సవాల్ విసురుతున్నా దమ్ముంటే రండీ చూసుకుందామని ఉగ్రవాదులు మేసేజ్ లు పంపారు.

‘‘మీరు కెనడాలోని సిక్కులందరినీ ఉగ్రవాదులని అంటున్నారు. మీరు రెచ్చగోట్టే చర్యలు మానుకోండి’’ అని కూడా మెసేజ్ లో పేర్కొన్నారు. పంజాబ్ తల్లులు దిలావర్ సింగ్ లాంటి బిడ్డలకు జన్మనివ్వడం అపలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. పంజాబ్ లో అనేక మంది దిలావర్ సింగ్ లు వున్నారని పేర్కొన్నారు. దిలావర్ సింగ్.. మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ కారులో బాంబును అమర్చి దానిని పెల్చి అతని హత్యకు కారకుడైన విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రి అమరీందర్ తో పాటు రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేసిన మాజీ డీజీపీ కేపీఎస్ గిల్ నూ కూడా వారు లక్ష్యంగా ఖలిస్తాన్ ఉగ్రవాదులు తాజాగా టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఉగ్రవాదుల హెచ్చరికలను తాను లక్ష్యపెట్టబోనని అమరీందర్ స్పష్టం చేశారు. కెనడాలో వారు తలలు బద్దలుగొట్టుకుని అరచినా, ఇసుమంతయినా తాను చలించబోనని, రాష్ట్ర అభివృద్ధి పైనే తన దృష్టి మొత్తం కేంద్రీకృతమై వుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : canada  Captain Amarinder Singh  Khalistani movement  KPS Gill  punjab  

Other Articles