Mathura village to fine girls using cell phones అమ్మాయిలు ఫోన్ మాట్లాడితే జరిమానా..!

Mathura village imposes hefty fine on girls using mobile phones

ban on girls using mobile phones, village girl mobile phone, fine on girls using mobile phone, village panchayat, Mathura's Madora village, cow slaughter fine, UP village fines cow slaughter, muslim village fines cow slaughter

A village panchayat in Mathura's Madora village has imposed a ban on girls using mobile phones outside their house.

అమ్మాయిలు సెల్ ఫోన్ మాట్లాడితే భారీ జరిమానా..!

Posted: 05/03/2017 07:58 PM IST
Mathura village imposes hefty fine on girls using mobile phones

మొబైల్ ఫోన్.. ప్రతి ఒక్కరి చేతిలో ఇది ఇప్పుడు తప్పనిసరి వస్తువుగా మారిపోయింది. అంతేకాదు ఆపదలో వున్నవారికి అదే సాయాన్ని అందించే అస్త్రం. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు దీని అవసరం అధికం. కానీ అలాంటి ఫోన్ అమ్మాయిలు వాడకూడదట. అమ్మాయిలు సెల్‌ఫోన్ ఉప‌యోగించ‌కూడ‌ద‌ని, ముఖానికి స్కార్ఫ్‌లు క‌ట్టుకోకూడ‌ద‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అలీఘర్ మేయర్ శకుంతల భారతి, ఎమ్మెల్యే సంజీవ్ రాజా క్రితం రోజు చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపితున్న క్రమంలోనే.. అమ్మాయిలు మొబైల్ ఫోన్స్ వాడుతూ.. వీధిలో నడిస్తే భారీ జరిమానా విధిస్తామని ఏకంగా గ్రామపంచాయితీ పెద్దలు ప్రకటించారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని మదుర జిల్లాలోని మడోర గ్రామ పంచాయతీ పెద్దలు ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక్క అమ్మాయిల ఫోన్ల వాడకంపైనే కాక, గోవులను చంపే వారిపై కూడా భారీ జరిమానా విధించేందుకు సిద్ధమైంది. ఆవులను చంపేవారికి వ్యతిరేకంగా ఇటీవల ఉత్తరప్రదేశ్ కు ఎన్నికైన కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రచారాన్నిసపోర్టు చేయాలని ముస్లిం కమ్యూనిటీ నిర్ణయించడంతో, గ్రామ మాజీ ప్రధాన్ మహమ్మద్ గఫ్ఫర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
ఆవులను దొంగలించేవారిపై లేదా చంపేవారిపై 2 లక్షలు, అదేవిధంగా మద్యం అమ్మేవారిపై రూ.1.11 లక్షలు , మొబైల్ ఫోన్లు వాడుతూ రోడ్లపై వీధుల్లో నడిచే అమ్మాయిలపై రూ.21వేల రూపాయలు జరిమానా విధించాలని పంచాయతీ సభ్యులు నిర్ణయించారు. అమ్మాయిలపై జరుగుతున్న క్రైమ్ కేసులను తగ్గించడానికి ఈ మేరకు జరిమానా విధించనున్నామని పంచాయతీ చెబుతోంది.  పెనాల్టీతో పాటు  ఏ మేరకు శిక్ష విధించాలో కూడా పంచాయతీ అంతా ఓ సారి నిర్ణయించనున్నారు.

అయితే భారతావనిలో భాగమైన ఈ గ్రామానికి ఇండియన్ పీనల్ కోడ్ వర్తించదా..? పురుషాధిక్య సమాజంలో అనాదిగా అమ్మాయిలు, మహిళలపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఈ పెనాల్టీల గురించి తెలిసిన నెట్ జనులు కామెంట్లు పెడుతున్నారు. అకాశంలో సగం అంటూ అన్నింటా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న మహిళలు, అమ్మాయిలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారా..? అన్నది వేచి చూడాల్సిందే. ఈ నిర్ణయంపై మహిళా సంఘాలు, జాతీయ మహిళా కమీషన్ కూడా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mobile phones  girls  penalty  Madora village  Mathura  uttar pradesh  

Other Articles