jana sena demands to postpone group-2 exams గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయండీ: వపన్ కల్యాన్

Pawan kalyan demands to postpone group 2 exams

Pawan Kalyan raises student issue, pawan kalyan demands to postpone group-2 exams, Jana Sena raises student issue, jana sena group 2 exams, pawan kalyan, jana sena, group-2 exams, APPSC, AP government, andhra pradesh

Jana Sena chief Pawan Kalyan raises student issue with andhra pradesh government, demands to postpone group-2 exams

గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయండీ: వపన్ కల్యాన్

Posted: 05/03/2017 07:04 PM IST
Pawan kalyan demands to postpone group 2 exams

నిత్యం రాజకీయ పార్టీల వైఫల్యాలపై ప్రశ్నిస్తూ.. ప్రజల పక్షాణ గళమెత్తుతున్న సినీ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ నిరుద్యోగ యువత పక్షాన కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఔత్సాహిక అభ్యర్థులు అంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్ప‌టికే విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారమే గ్రూప్ 2 పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించిన నేపథ్యంలో వాళ్ల తరపున గళమెత్తిన జనసేనాని.. ప్రభుత్వం అభ్యర్థుల అందోళనను కూడా అర్థం చేసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. గ్రూప్ 2 పరీక్షల నేపథ్యంలో ప్రిలిమ్స్ తో పాటుగా ఇదివరకే ప్రకటించినట్లుగా నిర్ణీత తేదీల్లో మెయిన్స్ పరీక్షలను కూడా నిర్వహిస్తామని, ఇందులో మార్పులేమీ ఉండ‌బోవ‌ని ఏపీపీఎస్సీ స్ప‌ష్టం చేసిన నేపథ్యంలో ఆయన గళంవిప్పారు,

పరీక్షలు అభ్యర్థుల కోసమా లేక అధికారులు నిర్ణత తేదీల కోసమా అని పవన్ ప్రశ్నించారు. అధికారులు ముందుగా ప్రకటించిన తేదీల్లో పరీక్షలను నిర్వహిస్తామని మొండిగా వ్యవహరించడం ద్వారా అభ్యర్థులు పరీక్షలకు ఎలా సన్నధమవుతారని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై ప్ర‌భుత్వం మ‌రోసారి ఆలోచించాల‌ని ఆయ‌న ఓ లేఖ ద్వారా ప్రభుత్వాన్ని, ఏపీపీఎస్సీని కోరారు. ప్రిలిమ్స్, మెయిన్స్ ప‌రీక్ష‌ల మధ్య 45 రోజులు మాత్రమే ‌గడువు ఉందని, ఆ సమయం పరీక్షలకు సన్నధమవుతున్న అభ్యర్థులకు స‌రిపోద‌ని, అభ్య‌ర్థుల్లో ఆందోళ‌న నెల‌కొంద‌ని ఆయ‌న అన్నారు. వారి ఆందోళ‌న‌ను ప్ర‌భుత్వం అర్థం చేసుకొని, అభ్య‌ర్థుల‌కు న‌ష్టం క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పవన్ డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  jana sena  group-2 exams  APPSC  AP government  andhra pradesh  

Other Articles