hyderabad auto driver honesty అటో డ్రైవర్ నిజాయితి.. అభినందించిన పోలీసులు

Police appreciates hyderabad auto driver honesty

police appreciates hyderabad auto driver honesty, hyderabad auto driver honesty, hyderabad auto driver gold chain, auto driver gold chain, priyanka, auto driver, mallesh, almasguda, saidabad, meerpet police station, hyderabad police

Hyderabad police appreciates auto drivers honesty, who returns 5 tula (50 grams) gold chain to the passenger which was stucked in between seats

అటో డ్రైవర్ నిజాయితి.. అభినందించిన పోలీసులు

Posted: 04/23/2017 01:27 PM IST
Police appreciates hyderabad auto driver honesty

ఆటోవాలాలపై అనేక జోకులున్నాయి. నగరానికి కొత్తగా వచ్చే ప్రయణాకులను అటోవాలాలు బోల్తా కోట్టించి ఏకంగా పెద్ద మొత్తంలో డబ్బుల వసూలు చేస్తారని కూడా సినిమాల్లో జోకులు పేలుతుంటాయి. అదే సమయంలో తమ నిజాయితీని కూడా నిరూపించుకున్న అటడ్రైవర్ల సంఖ్య కూడా తక్కువేం లేదు. అనేక మంది ప్రయాణికులు తమ వస్తువులను అటోలలో మర్చిపోయి వెళ్లినా వాటిని అంతే సురక్షితంగా పోలీసులకు అప్పగించిన వారికి కొదవ లేదు. అలాంటి వారి జాబితోలోకి మరో అటోడ్రైవర్ కూడా చేరిపోయారు.

ఓ ప్రయాణికురాలి తన అటోలో పోటోగ్గుకున్న ఐదు తులాల బంగారు గొలుసును తన చేతుల మీదుగానే అమెకు అప్పగించాడు అటోడ్రైవర్. అయితే ఆయనకు ఈ అవకాశాన్ని కల్పించారు పోలీసులు. ఇందుకు కారణం అటో డ్రైవర్ నిజాయితీనే. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని అల్మాస్‌గూడకు చెందిన ఎం.ప్రియాంక (28) సైదాబాద్ వెళ్లేందుకు మల్లేశ్ ఆటో ఎక్కి మల్లమ్మ చౌరస్తా వద్ద దిగింది. అక్కడి నుంచి మరో ఆటోలో సైదాబాద్ వెళ్లింది. సైదాబాద్ చేరుకున్నాక తన మెడలోని గొలుసు కనిపంచకపోవడంతో.. ప్రియాంక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కాగా, ఆటో శుభ్రం చేస్తున్న మల్లేశ్‌కు సీటులో ఇరుక్కుపోయిన ఐదు తులాల బంగారు గొలుసు కనిపించింది. దీంతో ఆయన దానిని తీసుకెళ్లి మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు. అప్పటికే గొలుసు పోయిన ఫిర్యాదు ఉండడంతో ఎస్సై లక్ష్మణ్‌రెడ్డి ప్రియాంకను పిలిపించారు. స్టేషన్‌కు వచ్చిన ఆమెను గుర్తుపట్టిన మల్లేశ్.. అమెదే ఈ గోలుసని భావించాడు, అయితే మల్లేష్ నిజాయితీని అభినందించిన పోలీసులు ఆయన చేతుల మీదుగా ఆ గొలుసును ప్రియాంకకు అందజేశారు.

తాను నిత్యం కష్టపడి అటో నడుపుతానని, అయినా నెలకు కొద్దిగానే మిగులుతుందని, ఈ నేపథ్యంలో తన పిల్లలను చదివించడం, ఇత్యాది ఖర్చులకే సరిపోతుందని మల్లేష్ తెలిపాడు. అయితే ఎంతగా కష్టపడి తమ కూతుళ్లకు తల్లిదండ్రులు బంగారు అభరణాలు చేయిస్తారో తనకు అర్థమవుతుందని చెప్పారు. బాధితురాలికి దానిని తిరిగి ఇస్తే తాను పొందిన ఆనందానికి అవధులు లేవని తెలిపారు. కాగా, పోయిందనుకున్న తన బంగారు గొలుసు దొరికిన ఆనందంలో వున్న ప్రియాంక.. ఆటో డ్రైవర్ మల్లేశ్‌కు రూ.3 వేలు బహుమానంగా ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : priyanka  auto driver  mallesh  almasguda  saidabad  meerpet police station  hyderabad police  

Other Articles