హీరో ధనుష్ రియల్ లైఫ్ ట్విస్టులో విజేత.. Dhanush Wins Case Against Couple Claiming To Be His Parents

Dhanush wins case against couple claiming to be his parents

Dhanush, Parents agitation, row over parentage, rajinikanth, Madras High court, Madurai, Tamilnadu, kollywood

Actor Dhanush has won the case against a couple who claimed to be his parents and sought maintenance from Rajinikanth's son-in-law. The Madras High Court today quashed the petition demanding maintenance from the actor.

హీరో ధనుష్ రియల్ లైఫ్ ట్విస్టులో విజేత..

Posted: 04/21/2017 11:49 AM IST
Dhanush wins case against couple claiming to be his parents

చిన్నప్పుడు తప్పిపోయిన తమ బిడ్డే పెరిగి పెద్దై పెద్ద హీరో అయ్యాడని న్యాయపోరాటం చేసిన వృద్ద జంటకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. దనుష్ పెద్ద హీరోగా మారడంతో ఆయన నుంచి తమకు భృతిగా కొంత నగదును ప్రతి నెల ఇవ్వాలని ఏకంగా మద్రాసు హైకోర్టు తలుపుతట్టిన వారికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు విచారణపై గత కొన్ని రోజులుగా రేగిన ఉత్కంఠకు ఎట్టకేలకు మద్రాసు హైకోర్టు చెక్ పెట్టింది. ధనుష్ వృద్ద జంట బిడ్డ కాడని తెలుపుతూ.. న్యాయస్థానం వారు దాఖలు చేసిన పిటీషన్ ను కోట్టివేసింది.

ధనుష్ చిన్నతనంలో తప్పిపోయిన తమ బిడ్డేనంటూ కత్తిరేసన్, మీనాక్షి అనే వృద్ద దంపతులు పేర్కోన్నారు. పదకొండో తరగతిలో వుండగా హాస్టల్ నుంచి పారిపోయాడని కూడా తెలిపారు. అయితే అతనే తమ కొడుకుని చిన్ననాటి ఫోటోలను చూసి గుర్తించామని, దీంతో అతని నుంచి ప్రతి నెల 65 వేల రూపాయల భృతిని తమకు కల్పించాలని కూడా న్యాయస్థానాన్ని కోరారు. ఇందుకు సాక్షంగా ధనుష్ చదువిన పదో తరగతి సర్టిఫికేట్లను దాఖలు చేసిన వృద్ద జంట అందులోని పుట్టుమచ్చల అధారంగా ధనుష్ తమ కొడుకేనని పేర్కోన్నారు.

హీరో నుంచి డబ్బులు లాగేందుకూ వృద్ద జంట ధనుస్ తల్లిదండ్రులమని చెప్పుకుంటున్నారని అతని తరపు న్యాయవాదులు న్యాయస్థానానికి వివరించారు. దీంతో ఫిబ్రవరి 28న మధురై లోని మద్రాసు హైకోర్టు బెంచ్ వృద్ద దంపతులు సాక్షంగా పెట్టిన పుట్టుమచ్చలు వున్నాయో లేదో పరీక్షించి చెప్పాలని మధురైూ మెడికల్ కాలేజీ అధికారులను అదేశించింది. దీంతో వాటిని పరీక్షించిన మీదట వైద్యబృందం పుట్టుమచ్చలు ఎలాంటి అధారాలు లేకుండా తొలగించవచ్చునని వారు న్యాయస్థానానికి నివేదించారు. దీంతో పుట్టుమచ్చలు లేని కారణంగా ధనుష్ వృద్ద జంట కొడుకు కాదని న్యాయస్థానం తీర్పును వెలువరించింది. దీంతో హీరో ధనుష్ కు ఊరట లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles