హర్ట్ టచింగ్: ఫోటోలు పక్కనపెట్టి పిల్లల ప్రాణాల కోసం ఫోటోగ్రాఫర్ పరుగు | Photographer puts down his camera to help children hurt in Syria blast.

Syrian photographer saved boy photos viral

Syrian Photographer, Photographer Puts Down Came, Photographer Syrian Boy Life, Syrian Photographer Run, Photographer Try To Save Kids, Photographer Breaks Down, Syrian Photographer, Takes Action Instead of Pictures

Hero Syrian photographer puts camera aside to carry injured children after deadly bomb blast near Rashidin, west of Aleppo.

ఫోటోల కన్నా ప్రాణమే ముఖ్యం

Posted: 04/19/2017 03:54 PM IST
Syrian photographer saved boy photos viral

ఏదైనా ఓ ప్రమాదం జరిగినా, లేక ప్రమాదంతో కొట్టుమిట్టాడుతున్న బాధితులను పట్టించుకోకుండా పోయే జనాల కంటే దాన్ని పదే పదే చూపుతూ ఆనందించే మీడియా ఆటిట్యూడే మహా డేంజర్. సేఫ్ గా బయటపడితే ఒక్క మాటతో సరిపెట్టి, ఏదైనా ఘోరం జరిగితే మాత్రం పదే పదే రిపీట్ మోడ్ లో చూపిస్తూ ఉండటం ఇప్పుడు అలవాటైపోయింది. అయితే ఇక్కడ మీకు చెప్పబోయే ఘటన మాత్రం అలాంటిది కాదు. హృదయాలను కదిలించేదిగా ఓ ఫోటోగ్రాఫర్ చేసిన పని ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.

గత వారం సిరియాలో ఓ ఆత్మాహుతి దాడి జరిగింది. పశ్చిమ అలెప్పో లోని రషీదిన్ ప్రాంతంలో జరిగిన సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ లో 126కి పైగా మృత్యువాత చెందగా, అందులో 80 మంది పిల్లలు ఉన్నారు. అంతర్యుద్ధంతో సతమతమవుతున్న నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో కారులో వచ్చిన ఓ వ్యక్తి పిల్లలకు చిప్స్ ప్యాకెట్లు పంచుతూ ఒక్కసారిగా ఈ దాడి చేశాడు.

ఇక దాడి అనంతరం అక్కడి ప్రాంతమంతా భీకరంగా మారిపోయింది. శవాల గుట్టలు, రక్తమోడుతున్న చిన్నారులు, హహకారాలు ఇది అక్కడి పరిస్థితి. ఆ సమయంలో అక్కడే ఉన్న  ఫోటోగ్రాఫర్ అబ్ద్ అల్కదర్ హబక్, అతని స్నేహితులకు స్వల్ప గాయాలయ్యాయి. స్పృహ వచ్చాక ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా ఉండటం గమనించిన అబ్ద్ క్షణం కూడా ఆలస్యం చేయలేదు.

 

తన స్నేహితులను సైతం కెమెరాలను పక్కనపెట్టమని చెప్పి వీలైనంత మందిని రక్షించేందుకు కదలమని పిలుపునిచ్చాడు. ముందుగా ఓ పిల్లాడి దగ్గరికి వెళ్లిన అబ్ద్ అతను చనిపోయి ఉండటంతో కాస్త ముందుకు కదిలాడు. అక్కడ ఓ చిన్నారి తుది శ్వాసతో కొట్టుమిట్టాడం హబక్ కు కనిపించింది. వెంటనే ఆ పిల్లాడిని తన చేతులతో ఎత్తుకుని పరుగు తీసి ఆంబులెన్స్ కి చేరవేశాడు. ఇక మరోసారి వెనక్కి వచ్చిన అతనికి ఓ పసికందు మృతదేహం కనిపించింది. అంతే ఎమోషనల్ అయిపోయిన అతను వెంటనే మోకాళ్లపై పడి రోదించటం మొదలుపెట్టాడు.

అబ్ద్ కాపాడిన ఆ పిల్లాడి ప్రాణాలు నిలబడ్డాయో లేదో తెలీదు. కానీ, పరిగిత్తే సమయంలో అతను కళ్లలోకి కళ్లు పెట్టి, చేతిలో చేయి వేసి రక్షించమంటూ దీనంగా చూశాడు అని ఫోటోలు తీసిన అల్ గరిబ్ తెలిపాడు. హబక్ లాంటి స్నేహితుడు ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నానంటూ అల్ గరిబ్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. 2011 నుంచి జరుగుతున్న సిరియా అంతర్యుద్ధంలో ఇప్పటిదాకా 3,20,000 మంది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు ఓ అంచనా.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Syrian Photographer  Save Children  Break Down  

Other Articles