ఎర్రబుగ్గ కార్ల సంస్కృతికి చెల్లు చీటీ.. ban on red beacons on cars of ministers and pm

Govt bans red beacons on all vip vehicles from may 1

red beacon, VIP, VIP culture, prime minister, Supreme Court, red beacon light, vvip culture, lal batti, lal batti cars, vvip cars, vvip convoy, news, latest news

Narendra Modi government banned the use of red beacon on vehicles attached to dignitaries, including the central and state ministers and other VVIPs.

ఎర్రబుగ్గ కార్ల సంస్కృతికి చెల్లు చీటీ.. మినహాయింపు ఆ నలుగురికే..!

Posted: 04/19/2017 03:22 PM IST
Govt bans red beacons on all vip vehicles from may 1

ఎర్రబుగ్గ కార్లతో అధికారదర్పం చాటుకుంటున్న వారికి చీటి చెల్లింది. సరిగ్గా కార్మిక దినోత్సవం రోజు నుంచి అమల్లోకి రానున్న నూతన ఉత్వర్వులతో ఇక ఎర్రబుగ్గ కార్లు కనిపించవు. ఒక్క రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా కనిపించావు. అంబులెన్స్, పోలీసు సహా ఇతర ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రం గతంలో మాదిరిగానే నీలిబుగ్గలను మాత్రమే వినియోగించాలి. మే 1 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం వీవీఐపీల సంస్కృతికి, ఎగ్రబుగ్గల సంప్రదాయానికి చరమగీతం పాడింది.

అయితే దేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్ సభ స్పీకర్ మినహాయించి వీటిని ఎవరూ వాడకూడదని ఉత్తర్లులలో పేర్కోంది. కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులతో పాటు గవర్నర్లు సహా అనేక మంది ఈ ఎర్రబుగ్గకార్లను వినియోగించేవారు. అయితే తాజాగా వచ్చిన ఉత్తర్వులతో ఇక వీరెవరూ ఎర్రబుగ్గకార్లను వినియోగించలేరు. ఇకపై ఎరుపురంగు బుగ్గకార్ల వినియోగంపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలతో స్వయంగా ప్రధాన మంత్రే ఎర్రబుగ్గల కారు వినయోగాన్ని కొల్పోతున్నారు.

కాగా  2002, 2005లో కేంద్రం జారీ చేసిన  నోటిఫికేషన్ల ప్రకారం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, కేబినెట్ మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, త్రివిధ దళాల అధిపతులు ఎర్రబుగ్గ వాహనాలు వాడొచ్చు. అయితే నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఎర్రలైటు వాహనాలను ఉపయోగించేవారికి భారీగా జరిమానాలు విధించేలా మోటారు వాహనాల చట్టానికి సవరణలు తేవాలని సూచించాలంటూ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. నీలిరంగు బీకర్లను అంబులెన్స్, పోలీసులు మాత్రమే అత్యవసర సమయాల్లో ఉపయోగించాలని సుప్రీంకోర్టు గతంలో సూచనలు చేసిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం నిర్ణయంతో ఇక ఎర్రబుగ్గల కార్లు కనిపించవు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : red beacon  VIP  VIP culture  prime minister  Supreme Court  

Other Articles