ఆన్ లిమిటెడ్ 4జీ డేటా జస్ట్ 73 రూపాయలే... తెలుగు స్టేట్స్ కు మాత్రమే | FRC73 Plan With Unlimited 4G Data.

Unlimited 4g data for rc 73

Telenor India, Telenor 4G Offer, Rechage 73 Telenor, Telenor Bumper Offer, FRC73, Telenor India Telugu States, AP Telangana Telenor Offer

Telenor India Introduces FRC73 Plan With Unlimited 4G Data for 28 Days. The new scheme is available only for the residents of Andhra Pradesh and Telangana circle.

73 రూపాయలకే అన్ లిమిటెడ్ డేటా

Posted: 04/18/2017 09:22 AM IST
Unlimited 4g data for rc 73

ధన్ ధనా ధన్ దెబ్బకి టెలికాం దిగ్గజాలని దిగి వస్తున్నాయి. వాళ్ల మధ్యపోటీ ఏమో కస్టమర్లు మాత్రం ఆనందంలో మునిగిపోతున్నారు. కొత్త ఆఫర్లతో జియో ముందుకు రావటం, ఆ రేసులో ఏదో ఒక టెలికాం సంస్థ ప్రతీ వారం సరికొత్త ఆఫర్ తో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో టెలినార్‌ ఇండియా కూడా చేరిపోయింది. 73 రూపాయలకే అన్ లిమిటెడ్ డేటా అందిస్తున్నట్లు ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సర్కిల్‌ లోని కొత్త 4జి వినియోగదారులకు ఈ అపరిమిత డేటా ఆఫర్‌ వర్తిస్తుంది. సిమ్ తీసుకున్న కొత్త వినియోగదారులు మొట్టమొదటిసారిగా రీఛార్జ్ 73 రూపాయలతో చేయిస్తే 30 రోజుల కాలపరిమితితో అపరిమిత 4జీ/2జీ ఇంటర్నెట్‌ సర్వీసులు అందించనున్నట్టు ప్రకటించింది.

ఇందులో 90 రోజుల కాలపరిమితితో లోకల్, ఎస్టీడీ కాల్స్ కు కేవలం నిమిషానికి 25 పైసలు మాత్రమే ఛార్జ్ చేస్తామని టెలినార్‌ తెలిపింది. అలాగే ఈ సిమ్ కు లైఫ్ వ్యాలిడిటీ వస్తుందని, అదనంగా 25 రూపాయల టాక్ టైమ్ కూడా ఉంటుందని టెలినార్ తెలిపింది. ఈ సిమ్ తీసుకున్న వినియోగదారులు 120 రోజుల్లోపు 47 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని, దీని ద్వారా మొదటి 30 రోజుల తరువాత ప్రతి 28 రోజులకు డేటా ఆఫర్ (47 రూపాయలు) వేయించుకుంటే అన్ లిమిటెడ్ డేటా వస్తుందని టెలినార్ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telenor India  4G Data New Plan  FRC73  

Other Articles