శశికళకు మాములు షాక్ కాదు.. పన్నీర్-పళనీ దోస్తీ | AIADMK factions inch closer to a patch-up.

Aiadmk ministers hold late night meeting in chennai for merger

AIADMK, AIADMK Merge, Sasikala Faction Panneerselvam Group, OPS Sasikala Group Merge, AIADMK Merge Plan, Dinakaran Arrest, Dinakaran Shock, Dinakaran Audio Tape Bribe, Sasikala Alone, AIADMK 123 MLAs

AIADMK ministers ready for merger with Panneerselvam faction, want Two Leaves symbol back. Dinakaran faces arrest, AIADMK floats merger plan.

తమిళనాడులో అర్థరాత్రి అలజడి

Posted: 04/18/2017 08:06 AM IST
Aiadmk ministers hold late night meeting in chennai for merger

తమిళ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. సోమవారం అర్థరాత్రి దాకా పరిణామాలు కొత్త చర్చకు దారితీశాయి. పన్నీర్, శశికళ రెండు చీలిక వర్గాలు విలీనం కానున్నాయన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. విలీన చర్చలపై మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం మాట్లాడిన వెంటనే సోమవారం ఉదయం 25 మంది మంత్రులతో సీఎం పళనిస్వామి ఉన్నపళంగా భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు రాత్రి బాగా పొద్దుపోయాక తమిళనాడు సీనియర్‌ మంత్రులు కూడా అత్యవసరంగా సమావేశం అయ్యారు. గ్రీన్‌వేస్‌ రోడ్డులోని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి కె.తంగమణి అధికారిక నివాసంలో ఈ చర్చలు కొనసాగాయి.

ఈ సమావేశంలో వర్గాల విలీనంపై చర్చించారు. భేటీ అనంతరం డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన విధివిధానాలు, సమైక్యంగా పార్టీని ముందుకు నడపడంపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. విలీనంపై పన్నీర్‌సెల్వం ఆలోచనను భేటీలో మంత్రులు, ఎమ్మెల్యేలంతా స్వాగతించారని ఆర్థిక శాఖ మంత్రి జయకుమార్‌ వెల్లడించారు. అమ్మ పాలన కొనసాగాలని, రెండాకుల చిహ్నం తిరిగి దక్కించుకోవాలనేదే అందరి అభిప్రాయమన్నారు.

పార్టీ డిప్యూటీ చీఫ్‌ దినకరన్‌ బెంగళూరులో ఉన్నందున తిరిగివచ్చాక ఈ అంశంపై ఆయనతో చర్చిస్తామని న్యాయ శాఖ మంత్రి సి.వి.షణ్ముగం అన్నారు. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా మంగళవారం చెన్నైకు రావాలని ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. విలీనం జరిగితే గనుక సెల్వంకు జనరల్ సెక్రటరీ పదవిని కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. శశికళ జైల్లో ఉండటం, ఇప్పటికే దినకరన్ చిక్కుల్లో ఉండటంతో, ఇవాళ ఢిల్లీ పోలీసులు ఈసీ లంచం కేసులో ప్రశ్నించబోతుండటం, అవసరమైతే అరెస్ట్ చేసే అవకాశాలు ఉండటంతో వాళ్లతో బలవంతంగానైనా రాజీనామా చేయించి పార్టీని ప్రతిష్టను కాపాడాలన్నదే అందరి ఏకాభిప్రాయంగా కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIADMK  Sasikala Faction  Panneerselvam  Merge  

Other Articles