సీఎం శుభసందేశాన్ని అందుకునే యువత వుందా..? Nitish Kumar calls for boycott of weddings with dowry

Nitish kumar urges people to avoid marriages where dowry is taken

Uday Narayan Choudhary, Patna Bihar, CM Nitish Kumar, B R Ambedkar, dowry, no dowry marriages, child marriages, liquor, bihar youth, students, dalit, weddings, boycott, mahadalit, marriage, nitish

Bihar CM Nitish Kumar asked all sections of society to boycott the marriage functions of the families in which dowry money has been transacted and aviod child marriages

సీఎం శుభసందేశాన్ని అందుకునే యువత వుందా..?

Posted: 04/15/2017 03:58 PM IST
Nitish kumar urges people to avoid marriages where dowry is taken

భీహార్ రాష్ట్రాన్ని దేశానికే అదర్శవంతంగా తీర్చిదిద్దడంలో నిమగ్నమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. సమాజంలో తీవ్ర ప్రభావం చూపుతున్న అంశాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అనాధిగా పురుషాధిక్య సమాజంపై అధిపత్యం చాటుతున్న వరకట్న మహమ్మారిపై యువద యుద్దాన్ని ప్రకటించాలని సూచించారు. దీంతో పాటు బాల్య వివాహాలకు కూడా వ్యతిరేకంగా యువత పోరాటం చేయాల్సిన అవసరముందని అన్నారు.

వరకట్నం సోమ్ము చేతులు మారిందన్న వార్తలు తెలిస్తే యువత ఆ వివాహాలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. మద్యం తయారీని, విక్రయాన్ని, వినియోగాన్ని పూర్తిగా నిషేధించిన.. మధ్య రహిత రాష్ట్రంగా బిహార్ తీర్చదిద్దడంలో సక్సెస్ సాధించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్, వరకట్నం, బాల్య వివాహాలను వ్యతిరేక ఉద్యమాన్నికి పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రసంగించిన నితీష్ కుమార్, దళితులు, మహాదళితులతో పాటు అన్ని వర్గాల ప్రజలు వరకట్నానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం వుందని అన్నారు.

వరకట్నం వివాహాల విషయంలో యువత వరకట్నాలు తీసుకోవద్దని పిలుపునిస్తూనే..  వరకట్నాలు తీసుకున్నారన్న సమాచారం తెలిస్తే.. ఆ పెళ్లిళ్ల కూడా హాజరుకావద్దని ఆయన యువతతో పాటు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. సమాజంలో ఉన్న వరకట్నాన్ని నిర్మూలించాల్సినవసరం ఎంతో ఉందని చెప్పారు. దీని బారిన పడి మనుషుల విలువకన్నా డబ్బుకే అధిక విలువ ఇచ్చే సంస్కృతి ఉద్భవించిందని అన్నారు. దీంతో పాటు బాల్య వివాహాలను కూడా అరికట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే సీఎం ఇచ్చిన మంచి సందేశాన్ని అందుకునే యువత, రాష్ట్ర ప్రభు్ు ముందుకు వస్తారా..? అన్నదే అసలు ప్రశ్నగా మిగులుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar cm  nitish kumar  no dowry marriages  child marriages  liquor  bihar youth  

Other Articles