ఢిల్లీ మెట్రో స్టేషన్ టీవీలో పాడు వీడియోలు.. Porn clip played on screen at Rajiv Chowk metro station

Porn clip played on screen at rajiv chowk metro station video goes viral

Delhi Metro, DMRC, New Delhi, porn video, Rajiv Chowk Metro Station, viral video, social media, rajiv chowk station video, viral video, trending video

A porn video being played on a screen at Rajiv Chowk metro station in New Delhi went viral on the social media

ITEMVIDEOS: ఢిల్లీ మెట్రో స్టేషన్ టీవీలో పాడు వీడియోలు.. వీడియో వైరల్.!

Posted: 04/15/2017 04:20 PM IST
Porn clip played on screen at rajiv chowk metro station video goes viral

దేశరాజధానిలో ఇప్పటికే అడపడుచుల పట్ల అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయన్న వార్తలు వస్తున్న తరుణంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే ఢిల్లీలోని రాజీవ్‌ చౌక్‌ మెట్రో రైల్వే స్టేషన్‌లోని టీవీలలో బూతు వీడియోలు ప్రదర్శించారు. అయితే స్టేషన్ లోని అన్ని టీవీలలో కాకుండా కేవలం ఒక్క టీవీలో మాత్రమే పోర్న్‌ వీడియో ప్రదర్శితమైంది. ఈ వీడియోను చూసిని ప్రయాణికులు నిశ్చేష్టులయ్యారు. రైల్వే స్టేషన్ లోని టీవీలో పబ్లిక్ గా, అందులోనే మహిళలు వున్న చోట ఈ వీడీయో ఎలా ప్లే అయ్యింది.. ఎవరు ప్లే చేశారన్న కోణంలో ఢిల్లీ మైట్రో రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు.

రైల్వే స్టేషన్ లోనీ టీవీలో నీలిచిత్రం ప్రదర్శితమైన ఘటనపై అందరిలా కాకుండా కొంత భిన్నంగా వ్యవహరించిన ఓ ప్రయాణికుడు.. అక్కడ జరుగుతున్న తంతునంతా తన మొబైల్ లో రికార్డు చేసి.. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. అంతే అదికాస్తా ఒక్కసారిగా వైరల్ అయ్యింది. దీంతో షాక్‌ తిన్న ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(డీఎమ్‌ఆర్‌సీ) అధికారులు ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇందుకుగల కారణాలను కూడా విచారిస్తున్నారు.

ఈ ఘటన ఏప్రిల్‌ 9న చోటు చేసుకోగా.. అదే రోజున ఓ ప్రయాణికుడు ఈ వీడియోను తన అకౌంటు ద్వారా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ప్రయాణీకులు ఆ టీవీ ముందుగా నడుచుకుంటూ వెళ్లిపోతున్నట్లు వీడియోలో ఉంది. మరికొందరు తమ సెల్‌ఫోన్లలో ఆ ఘటనను బంధిస్తూ కనిపించారు. కాగా, ఈ ఘటనపై డీఎమ్‌ఆర్‌సీని ప్రశ్నించగా.. కమర్షియల్‌ యాడ్స్‌ కోసం ఉద్దేశించిన టీవీ అని తెలిపారు. అయితే అందులో ఈ బూతు వీడియో ఎలా ప్రదర్శితమైందో తమకు తెలియదని అన్నారు. దీనిపై విచారణ జరుగుతుందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi Metro  DMRC  New Delhi  porn video  Rajiv Chowk Metro Station  viral video  

Other Articles