శ్రీనగర్ లోక్ సభ ఉపఎన్నికలో ఫరూఖ్ అబ్దులా గెలుపు..! Farooq Abdullah wins Srinagar by-poll

Farooq abdullah ahead of pdp in key srinagar by poll

Srinagar-Budgam by-election Results, Jammu and Kashmir, National Conference, Farooq Abdullah, Peoples Democratic Party, Nazir Ahmad Khan, Srinagar Lok Sabha constituency, srinagar bypoll result

National Conference (NC) president Farooq Abdullah had taken a lead of nearly 10 thousand votes over his nearest rival Nazir Khan of the ruling Peoples’ Democratic Party (PDP) in the counting of by-polls to Srinagar-Budgam parliamentary constituency

ఉపఎన్నికలో విజయభేరి మ్రోగించిన ఫరూఖ్ అబ్దులా..!

Posted: 04/15/2017 01:16 PM IST
Farooq abdullah ahead of pdp in key srinagar by poll

శ్రీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నికలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు.. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి అయిన ఫరూక్‌ అబ్దుల్లా రమారమి విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ఇవాళ కొనసాగుతున్న క్రమంలో ఆయన అది నుంచి తన ప్రత్యర్థులపై అధిపత్యం చాటుకున్నారు. అధికార పీడీపీ అభ్యర్థి నాజిర్‌ అహ్మద్ ఖాన్‌ కంటే ఆయన సుమారుగా పది వేల ఓట్ల అధిక్యంతో ముందుకు దూసుకెళ్తున్నారు. కౌంటింగ్‌ కోసం ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

ఈ నియోజకవర్గంలో మొత్తంగా 12 లక్షల 61 వేల 862 మంది ఓటర్లు వుండగా, ఉగ్రవాద ప్రభావితానికి తోడు అల్లరి మూకలు సృష్టించిన హింస నేపథ్యంలో అత్యంత స్వల్ప ఓటింగ్ ఇక్కడ నమోదైంది. మొత్తంగా 52132 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఇవాళ జరిగిన ఓట్ల లెక్కింపులో 57.24 శాతంతో 29 వేల 839  ఓట్లను సాధించిన నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ఫరూఖ్ అబ్దుల్లా రమారమి విజయం సాధించారు. అయితే అయన విజయాన్ని ఎన్నికల సంఘం అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి వుంది.

అధికార పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసిన నజీర్ అహ్మద్ ఖాన్ కేవలం 38.62 శాతం ఓట్లను సాధించి.. 20 వేల 134 ఓట్లను మాత్రమే పొందగలిగారు. దీంతో ఆయన రెండవ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నెల తొమ్మిదిన జరిగిన ఈ ఉపఎన్నికలో మొత్తం తొమ్మిదిమంది అభర్థులు పోటీపడ్డారు. పీడీపీ నేత తారిఖ్‌ హమీద్‌ రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా పోలైన 52 వేల 132 ఓట్లలో ఒక్క శాతం కన్నా అధికంగా నోటా బటన్ కు ఓటర్లు ఓటు వేశారు. దీంతో తొమ్మిది మంది అభ్యర్థులలో ఎవరూ నచ్చలేదన్న సంఖ్య కూడా ఒక్కశాతాన్ని మించింది. నోటా బటన్ ను ప్రాధాన్యమిచ్చిన ఓటర్ల సంఖ్య ఏకంగా 542గా వుంది.

వేర్పాటువాదులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడంతో... ఈ ఉప ఎన్నికలో కేవలం 7శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.  తొలుత ఏప్రిల్‌ 9(ఆదివారం) ఇక్కడ ఉప ఎన్నికలు జరగగా.. అల్లర్ల కారణంగా అతి తక్కువ పోలింగ్‌ నమోదైంది. దీంతో అధికారులు తిరిగి ఏప్రిల్‌ 13న 38 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా ఈ నెల 9న పోలింగ్‌ సందర్భంగా చెలరేగిన హింసలో ఎనిమిది మంది చనిపోయారు. కాగా ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలలోకి మీడియాను అధికారులు అనుమతించలేదు. కనీసం కౌంటింగ్ కేంద్రాల వ్దనున్న మీడియాత కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల సమాచారాన్ని కూడా చేరవేయలేదని మీడియా ప్రతినిధులు మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles