సొంతపార్టీపై నిప్పులు చెరిగిన టీడీపీ ఎంపీ.. tdp mp shiva prasad slams his own government

Tdp mp slams own party leadership in not fullfilling ambedkar dreams

TDP MP Shiva prasad, chitoor MP Shiva prasad, MP slams own party, MP slams his government, shiva prasad slams tdp leadership, siva prasad slams chandra babu, ambedkar birth anniversary

Telugu desam party chitoor MP shiva prasad slams own party leadership in not fullfilling ambedkar dreams and decieving SC and STs.

సొంతపార్టీపై నిప్పులు చెరిగిన టీడీపీ ఎంపీ..

Posted: 04/14/2017 03:13 PM IST
Tdp mp slams own party leadership in not fullfilling ambedkar dreams

అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సొంత పార్టీపైన విమర్శలు గుప్పించి.. తాను ఎస్సీ, ఎస్టీలకు ఏం సమాధానం చెప్పాలని ఎదురు ప్రశ్నించారు చిత్తూరు ఎంపీ శివప్రసాద్, తాను అ పార్టీకి చెందిన నాయకుడినే అన్న విషయాన్ని మర్చిపోలేదు కానీ.. తాను ఎన్నికైన తరువాత కూడా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీలు పూర్తి కాకపోవడంతో.. తనను ఆయా వర్గాలకు చెందిన ప్రజలు నిలదీస్తున్నారని, దీనికి తాను ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని ఎంపీ అవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా మూడేళ్లు కావస్తున్నా.. తమ వర్గాలకు చెందని ప్రజల హామీలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చెందంగా మారాయని అన్నారు తమ ప్రభుత్వం ఎస్టీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని భాదను వెళ్లగక్కారు. శుక్రవారం అంబేద్కర్‌ జయంతి సభలో చిత్తూరులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుడ్డారు. నవ్యాంధ్ర ప్రజలకు ఇచ్చిన ఎన్నికలల హామీలలో 90శాతం పూర్తి చేశామని, అయితే మిగిలిన ఆ పది శాతం తమ ఎస్సీ, ఎస్టీలకు చెందినవేనా అని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలో జనాభా నిష్పత్తిలో 20శాతంగా వున్న తమకు మంత్రివర్గంలో మాత్రం రెండు పదవులే వరించాయని, మరో మూడు మంత్రి పదవులు తమ వర్గానకి దక్కాల్సి వున్నా వాటిని ఇవ్వలేదని ఆయన అరోపించారు. అటు కేంద్రంలో రాష్ట్రానికి రెండు మంత్రి పదవులు వస్తే రెండూ ఓసీలకే ఇచ్చారని.. డిప్యూటీ సీఎం పదవులను బీసీలకు ఇచ్చారని.. అన్నింటినీ అందరికీ ఇచ్చి.. తమ వరకు వస్తే మాత్రం మోసం చేయడమే టీడీపీ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని ఆయన అరోపించారు.

డీకేటీ భూములకు పట్టాలను ఇస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం మూడేళ్లవుతున్నా వాటి ఊసే తీయడం లేదన్నారు. పరిశ్రమ డీకేటీ భూములను లాక్కుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములు తీసుకుని ఓనర్లను శ్రామికులుగా మారుస్తున్నారని అరోపించారు. ప్రభుత్వ భూములు కబ్జా అయినా పట్టించుకోరుచచ కానీ వాటిలో దళితులు ఉంటే మాత్రం ఖాళీ చేయాలని నోటీసులు ఇస్తారని మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులకో న్యాయం, పైవర్గాల వారికి మరో న్యాయం కోనసాగుతుందని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు దారి మళ్లిస్తున్నారు.. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్కాలర్‌ షిప్‌ లు కట్‌ చేస్తున్నారు.. బ్యాక్‌ లాగ్‌ ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదని శివప్రసాద్‌ ధ్వజమెత్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  chitoor MP  MP Shiva prasad  chandrababum  SC  ST  ministry  government  

Other Articles