ప్రత్యేక హోదాపై మళ్లీ గళమెత్తిన జనసేనాని పవన్ Janasena chief pawan kalyan slams bjp on a[ special status

Jana sena chief pawan kalyan slams tdp mps and bjp on scs

jana sena, janasena, pawan kalyan, pawan on ap special status, pawan on bjp tarun vijay, pawan on tdp mps, pawan on mp self respect, pawan on ashok gajapathi raju, ap special status, keshava rao, r anand bhaskar, ysrcp mlas, cpi narayana, twitter, social media

Jana sena chief pawan kalyan slams tdp mps for being absent in the house while debate on special status going on, and says dravida bharata people are foundation of the nation not northern political leadership

ప్రత్యేక హోదాపై మళ్లీ గళమెత్తిన జనసేనాని పవన్.. బీజేపీకి చురకులు..

Posted: 04/13/2017 11:46 AM IST
Jana sena chief pawan kalyan slams tdp mps and bjp on scs

జనసేన అధినేత పవన్ కల్యాన్ మరోమారు రాష్ట్ర ప్రత్యేక హోదాపై గళం విప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని అధికారంలోకి వచ్చిన మిత్రద్వైయం టీడీపీ-బీజేపిలపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రజలకు గుప్పించిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వాలు మర్చిపోయాయని అగ్రహ్యాన్ని వ్యక్తం చేశారు. సభలో వున్న కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు కూడా ఈ అంశంపై మౌనముద్ర వహించడాన్ని జనసేననాని తప్పబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అంశంపై చర్చ జరుగుతున్న సేపు టీడీపీ ఎంపీలు సభకు గైర్హాజరు కావడం ఏంటని ఆయన నిలదీశారు.



నవ్యవంధ్రకు ప్రత్యక హోదా విషయంలో కేంద్రంతో టీడీపీ ప్రభుత్వం లాలూచీ పడాల్సిన అవసమేంటని ప్రశ్నించారు. అసలు టీడీపీ- బీజేపిలు అధికారంలోకి రావడానికి కారణం కూడా ప్రత్త్యేక హోదాను తీసుకువస్తామని ఎన్నికల ముందు ఆయా పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీయే కారణమని, వారిని విశ్వసించి ప్రజలు ఓట్లు వేయబట్టి ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చాయని ఆయన ఇవాళ పేర్కోన్నారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ అనుసంధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పలు విమర్శలను గుప్పించారు.

 దక్షిణాది రాష్ట్రాలవారు నల్లగా వుంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రిపై క్షమాపణలు చెప్పనంత మాత్రాన మర్చిపోయే అవమానం కాదది అని ఈ నెల 7న ట్విట్ చేసిన తరువాత పవన్ మళ్లీ సామాజిక మాద్యమం ద్వారా ప్రత్యేకహోదాపై తన అక్కస్సును వెళ్లగక్కారు. నవ్యాంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తమ మద్దతు తెలిపిన కాంగ్రెస్ ఎంపీ రాపోలు అనంద భాస్కర్, టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ అంశంలో రాజీలేని పోరాటం చేస్తున్న వైసీసీ సభ్యులను కూడా ఆయన కొనియాడారు.

 


టీడీపీ సభ్యులు ఉత్తర భారతం ఎంపీలు తమ కేంద్రమంత్రి అశోక గజపతి రాజుపై జరిపిన అవమానాన్ని మర్చిపోయినట్లు వున్నారని.. పార్లమెంటు సాక్షిగా తమ ఎంపీకి జరిగిన పరాభవం విషయంలో ఉత్తరాది ఎంపీలు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇదే తరహా దాడులు గతంలో రాష్ట్ర విభనస సమయంలోనూ జరిగాయని ఆయన గుర్తుచేశారు. అయితే రాష్ట్రానికి సంబంధించిన అంశంలో.. మరీ ముఖ్యంగా రాష్ట్ర యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశంలో మన ఎంపీలు ఇంకా ఒక్కటి కాలేకపోతున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎంపీలు తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టవద్దని ఆయన విన్నవించారు.

మన శరీరవర్ణాన్ని తక్కువ చేసిన చిన్నచూపు చూసినా ఫర్వాలేదు, మన ద్రవిడ బాషను ఎగాతాళి చేసినా.. ఫర్వాలేదు.. మన ఎంపీలను పార్లమెంటులో పట్టుకుని తిట్టినా..? కోట్టినా పర్వాలేదు.. వీటన్నింటినీ మేం సహిస్తాం, భరిస్తాం. కానీ ప్రజల ఓట్లతో గెలిచి ఢిల్లీకి వెళ్లగానే అక్కడ నుంచి మన వ్యాపారాలకు, కాంట్రక్టులకు ఎలాంటి అవరోధం కలగకుండా మాత్రం చూసుకుంటాం. మన గెలిచింది ప్రజలక కోసం కాదు కేవలం మన కోసం, మన వ్యాపారాలు, కాంట్రాక్టుల కోసం అన్నట్లుగా మన ఎంపీలు వ్యవహరిస్తున్నారని, మన స్కాములు బయటపడకుండా, మన తప్పలు కప్పిపుచ్చితే అదే పదివేలు అనుకుంటామని మన ఎంపీలు భావిస్తున్నారని ఆయన వ్యంగస్త్రాలు సందించారు. ఇలాంటి ఎంపీలతో మన హోదా కోసం కేంద్రంలో ఎలా పోరాడుతామని పవన్ ప్రశ్నించారు. వారి స్వలాభాల కోసం.. వారి స్వలాభాల కోసం.. వ్యాపారాల కోసం.. కాంట్రాక్టుల కోసం ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే నాయకులతో రాష్ట్రానికి ఏం లాభం చేకూరుతుందని పవన్ నిలదీశారు.

 



కేంద్రంలో సత్సంబంధాలను కలిగివుండాలన్న విషయాన్ని తాను అంగీకరిస్తానని, అయితే  రాష్ట్రానికి మళ్లీ మళ్లీ అవమానాలు పునారవృతం అవుతుంటే.. ఇక వారితో సఖ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రజల డిమాండ్ అనుసరించి కేవలం దక్షిణాదిలో వున్న ఆంధ్రప్రదేశ్ ను మాత్రమే కేంద్రం విభజిస్తుందా..? ప్రజలు డిమాండ్ ఇక్కడి వరకే పరిమితం అవుతుందా..? అని కూడా ఆయన ప్రశ్నించారు. అయితే ఇంతకు రెట్టింపు స్థాయిలో ఉత్తర్ ప్రదేశ్ విభజన అంశం తెరమీదకు వస్తున్నా కేంద్రానికి ఉత్తర్ ప్రదేశ్ ను విభజించే దమ్ము వుందా..? ఆని ఆయన నిలదీశారు.



దేశాన్ని బీజేపి నేత తరుణ్ విజయ్ చెప్పినట్లుగా ఉత్తరం, దక్షిణంగా విడదీయాలని కేంద్రం భావిస్తుందన్న అనుమానాలను వ్యక్తం చేసిన సిపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ చేసిన వ్యాఖ్యలు విన్న తరువాత తనలోనూ అధే భావన కలుగుతుందని పవన్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష కోనసాగించిన పక్షంలో అన్ని దక్షిణాది రాష్ట్రాలు సమైక్యంగా ఉద్యమించాల్సిన అవసరం, ఐక్యగళం వినిపించాల్సిన అవసరం వుందని పవన్ అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాలు ముక్తకంఠంతో ఒకే వేదికపైకి వచ్చి.. తమ గళాన్ని వినిపించాలని ఆయన పిలుపునిచ్చారు.



తరణ్ విజయ్ దక్షిణాది ప్రజలపై చూపిన చులకన బావన ఇక్కడి ప్రజలపై ఉత్తరాది ప్రజలకు ఎలాంటి అభిప్రాయముందోనన్న విషయంలో ఉదాహరణగా నిలుస్తుందని, మా వర్ణం, మా బాషను ఎగతాళి చేయడం, వాటికి క్షమాపణలు చెప్పడం వారికే చెందుతుందని పవన్ దుయ్యబట్టారు. ద్రవిడ భారతం పట్ల ఉత్తరభారత నేతలకు వున్న చులకన అభిప్రాయం ఈ బీజేపి నేత మాట్లలో వ్యక్తమైందన్నారు. దేశానికి దక్షిణ భాగాన వున్న తాము ఈ దేశానికి పునాదులమన్న విషయాన్ని.. ఉత్తరభారత నాయకత్వం కాదన్న విషయాన్ని కూడా తరుణ్ విజయ్ గుర్తుపెట్టుకోవాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles