ఓపెన్ ఛాలెంజ్: దమ్ముంటే ఎవరైనా హ్యాక్ చేయండి | EC challenges sceptics to Hack EVMs.

Election commission challenges people to hack evms

Election Commission, Election Commission EVM, Election Commission Challenges, Election Commission Parties, Sceptics EVM, EVM Tampering, EVM Hack Challenge, Hack EVM Prove It, Amarinder Singh EVM Hack, Electronic Voting Machine Hack

Election Commission challenges political parties, experts to hack, tamper their EVMs.

ఈసీ సవాల్: దమ్ముంటే నిరూపించండి

Posted: 04/13/2017 09:46 AM IST
Election commission challenges people to hack evms

ఈవీఎం హ్యాక్ అంటూ ఎన్నికల సంఘంపైనే రాష్ట్రపతికి ఫిర్యాదు చేసే స్థాయికి విపక్షాలన్నీ చేరుకున్నాయి. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తోందని కాంగ్రెస్ సహా పలు పార్టీలన్నీ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అయితే ధృతరాష్ట్రుడు, ధుర్యోధనుడు అంటూ కామెంట్లు చేశాడు. కాంగ్రెస్ ఏకంగా ఓ కమిటీ వేసి పార్టీలన్నింటిని ఒక దగ్గరికి చేర్చే యత్నం చేస్తోంది.

అయితే ఈ విమర్శలపై ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. చేతనైతే ఈవీఎంలను హ్యాక్ చేసి చూపించాలంటూ రాజకీయ పార్టీలు, హ్యాకర్లు, శాస్త్రవేత్తలకు, ప్రజలకు బహిరంగ సవాల్ విసిరింది. ఎవరైతే ఈవీఎంలను దుర్వినియోగం చేయొచ్చని వాదిస్తున్నారో వారికి ఛాలెంజ్. తాము మే మొదటి వారంలో సిద్ధంగా ఉంటాము, ఎవరైనా వచ్చి నిరూపించవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, తాను ఐఐటీ చేశానని, 24 గంటల సమయం ఇస్తే ఈవీఎంలు దోషపూరితమని నిరూపిస్తానని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే మరో పక్క పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ ను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాయి. ఈవీఎంలలో అవకతవకలు జరిగి ఉంటే తాను సీఎం కుర్చీలో కూర్చొని ఉండేవాడిని కాదని చెబుతున్నాడు. మళ్లీ అకాళీదల్-బీజేపీ కూటమే అధికారంలోకి వచ్చి ఉండేది కదా అని వ్యాఖ్యానించాడు. ఆరోపణలు వెలువెత్తిన సమయంలో యూపీ ఎన్నికల కోసం వాడిన మెషీన్ ను డెమోకు వాడటం, అందులోని డేటాను తొలగించకపోవటం మూలంగానే ఏ బటన్ నొక్కినా బీజేపీ అభ్యర్థికే ఓటు పడటం జరిగిందని ఈసీ వివరణ ఇచ్చుకుంది. అయినా మొండిగా విఫక్షాలు బ్యాలెట్ ఓటింగ్ ను పునరుద్ధించాలని పట్టుబడుతున్నాయి. 2009లో యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు బీజేపీ కూడా ఇలాంటి ఆరోపణలే చేయగా, అప్పుడు కూడా ఈసీ ఇలాంటి సవాలే విసిరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Election Commission  All Parties  EVM Tampering  Challenge  

Other Articles