బికినీ ఎయిర్ హోస్టెస్.. విమానాలు ఫుల్ | Popular Vietnam airline has bikini-clad flight attendants.

Vietjet airlines hot air hostesses dress in bikinis

Vietjet Air, Bikini Air hostess, Flight Bikini, Vietnam Airlies, Vietnam Bikini Air hostess, Bikini Airline, Hot Air Hostess

Vietnam's privately owned airline, VietJet, has air hostesses wearing sexy bikinis on-board the inaugural flight to any beach destination.Tourism Ministry teases possibility of ‘bikini airline’ Vietjet Air opening route to Indonesia.

వాళ్ల దెబ్బకు విమానాలు నిండిపోతున్నాయి

Posted: 04/13/2017 09:03 AM IST
Vietjet airlines hot air hostesses dress in bikinis

బికినీ ఆ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కనులకు ఇంపుగా సొంపుగా ఉండే రెండు అంగుళాల రెండు గుడ్డల కోసం ఎగబడిపోయే వారు ఎందరో. అంతేందుకు సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ బికినీ అని చెబితే చాలూ థియేటర్లకు క్యూ కట్టే జనాలున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటిది ఓ విమానంలో టూ పీస్ లో ఎయిర్ హోస్టెస్ ఉంటే ఎలా ఉంటుంది. సరిగ్గా ఇప్పడు అక్కడ ఇలాంటి సీనే దర్శనమిస్తోంది.

వియత్నాంకు ప్రైవేట్ ఎయిర్ లైన్స్ వియెట్ జెట్ ఈ వినూత్న ఆలోచన చేసింది. ఇతర ఎయిర్ లైన్స్ కు భిన్నంగా తమ విమానాల్లో సేవలందించే ఎయిర్‌ హోస్టెస్‌ లతో బికినీలు వేయించింది. అయితే ఈ ఆదేశాలు కేవలం బీచ్ లకు వెళ్లే విమానాలలో పనిచేసే సిబ్బందికి మాత్రమే వర్తిస్తుందంట. దీంతో ఇప్పడు ఈ విమానాల్లో ఎయిర్ హోస్టెస్ లు టూపీస్ బికినీల్లో దర్శనమిస్తున్నారు. ఇంకేం వాళ్ల లక్ష్యం నెరవేరింది. ఊహించని రేంజ్ లో ప్రయాణికులు ఈ ఎయిర్ లైన్స్ కు క్యూ కట్టేస్తున్నారు. అంతేనా ముద్దుగా బికినీ ఎయిర్ లైన్స్ అంటూ పేరు కూడా పెట్టేశారు.

Bikini Airhostess

Vietnam Air Hostess

2011లో ఈ ఎయిర్‌ లైన్స్‌ యజమాని గుయెన్ థీ పుహోంగ థావో ఏకంగా ఎయిర్‌ హోస్టెస్‌ లతో ఫ్యాషన్‌ షూట్‌ చేయటమే కాకుండా, విమానంలో బికినీ షో చేయించాడు కూడా. అయితే డ్రెస్ కోడ్ ను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ విమాన సంస్థల బోర్డు 2012లో వియత జెట్ ఎయిర్ లైన్స్ పై జరిమానా విధించిందింది లేండి. మళ్లీ ఆరేళ్ల తర్వాత అదే ఆలోచనను అమలు చేశారు. అయితే మొదట్లో పేరు ప్రతిష్టలు దెబ్బతింటుందని, ప్రయాణికులు తగ్గిపోతారని అంతా భావించగా, సీన్ రివర్స్ అయ్యి ఇలా సీట్లు ఫుల్ అయిపోతున్నాయి. అయితే దీని ద్వారా ప్రభుత్వ ఎయిర్ లైన్స్ కు దెబ్బ పడిపోతుందని భావిస్తున్న పర్యాటక శాఖకు దానిపై నియంత్రణలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

VitJet Airlines Hot Air Hostess

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vietnam  VietJet  Bikini Air hostess  

Other Articles

Today on Telugu Wishesh