తాగుబోతులకే తాత ఈ పంది.. చూసి షాక్ అవ్వకండి | Mexican pig drinking 3 beers in seconds.

Pig drinks 3 bottles of beer in mexico

Mexican Thirsty Pig, Pig 3 Beers, Pig Three Beers, Mexican Bar Pig, Pig Beer, Drunken Pig, Pig Beer Video, Three Beers Seconds, Pig Three Beers, Pig Video, Funny Pig Video

Meet this Mexican Thirsty Pig who drink three beers in seconds. Video Viral on Social Media.

ITEMVIDEOS:మూడు బీర్లు దించకుండా సెకన్లలో ఫినిష్

Posted: 04/13/2017 08:31 AM IST
Pig drinks 3 bottles of beer in mexico

ఇదిగో ఇక్కడ మీరు చదవబోయే కథనం కాస్త విడ్డూరంగానే అనిపించొచ్చు. గొంతు ఎండిపోతుంటే మాములు మనుషులెవరైనా మంచి నీళ్ల కోసం వెంపర్లాడతారు. అదే మందు బాబులైతే చల్లటి బీరు కోసం తహతహలాడిపోతుంటారు. మరి అదే ఒక వరాహం అయితే... మెక్సిలో ఓ బార్ బయట ఓ పందిగారు చేసిన నిర్వాకం ఇప్పుడు నెట్ లో తెగ వైరల్ అవుతోంది.

ఎంచక్కా బీరు కొట్టేసింది. వన్.. టూ... త్రీ అంటూ ఏకంగా మూడు బీర్లు అవలీలగా తాగేసింది. పట్టణంలోని స్థానికంగా ఉండే ఓ బార్ బయట తిరుగాడుతున్న ఓ పంది దాహం వేసి అక్కడే ఉన్న ఓ ఖాళీ బీర్ బాటిల్ ను తాగేందుకు ట్రై చేసింది. అయితే అందులో చుక్క కూడా లేకపోవటంతో దిగాలుగా ఉండిపోయింది. అ తతంగం అంతా చూసిన ఓ తాగుబోతుకు జాలేసి దాని ముందు ఓ బీర్ బాటిల్ ఉంచాడు. అంతే అమాంతం దాన్ని ఎత్తి తన నోట్లో పెట్టుకుని తన దాహం తీర్చేసుకుంది.

 

టేస్ట్ నచ్చిందో, లేక దాని దాహం తీరలేదో ఏమో అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది. దాంతో మరో బాటిల్ ను దాని ముందు ఉంచారు. దాన్ని కూడా క్షణాల్లో లేపేసింది. ఆపై మరో వ్యక్తి తాగుతుంటే ఆ బాటిల్ ను కూడా చూస్తూ ఉండటంతో ఇంకో బాటిల్ ను ఉంచటం, దాన్ని లాగించేయటం... అలా పంది తన ప్రతాపం చూపించేసింది. తమ కంటే స్పీడ్ గా బీర్ బాటిళ్లను లేపేసిన ఆ తాగుబోతు పందిని అక్కడే ఉన్న తోటి తాగుబోతు మనుషులు వీడియో తీసి నెట్ లో అప్ లోడ్ చేయగా అది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. గతంలో కోతులు, గోర్రెలు, సింహాలు ఇలా కొన్ని జంతువులు కూడా ఇలాగే సీసాలను లేపేయగా, ఇంతలా ఎగబడటం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Mexico  Pig  Drink Beers  

Other Articles