అద్వానీకి చెల్లుచీటి.. దళితుడికే రాష్ట్రపతి పదవి.. BJP to propose Dalit candidate for president election x

Bjp to propose dalit candidate for president election

Narendra Modi, RSS, Mohan Bhagwat, President, Prime Minister, Thawar chand gehlot, dalit, LK Advani, Pranab Mukharjee, presidential candidate

RSS may propose the name of Union social justice minister Thawar Chand Gehlot, nominee for the presidential elections, a prominent face from the schedule castes.

అద్వానీకి చెల్లుచీటి.. దళితుడికే రాష్ట్రపతి పదవి..బీజేపి యోచన

Posted: 04/08/2017 10:01 AM IST
Bjp to propose dalit candidate for president election

రాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీజేపీ ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న విధంగా పావులు కదుపుతుందా.? అంటే అవుననే సమాధానాలే వినిసిస్తున్నాయి. కేంద్రంలో బీజేపి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పార్టీ అగ్రనేత ఎల్ కే అద్వానికి దేశాధ్యక్షుడి పదవికి ఎంపిక చేసి తద్వారా సముచిత స్థానం కల్పించాలని ఇన్నాళ్లు బావించిన పార్టీ.. తీరా ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ తాను రేసులో లేను అని చెప్పిన కొన్న రోజులకే తాను కూడా దేశాధ్యక్ష పదవికి రేసులో లేను అని బీజేపి సీనియర్ నేత అద్వానీ స్పష్టం చేశారు.

దీంతో పెద్దాయనను రాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా ఓప్పించాల్సిన బీజేపి.. పార్టీని ఇన్నాళ్లు తమ భుజస్కంధాలపై మోసి పెంచి పెద్ద చేసిన పెద్దాయన రేసులో లేను అని చెప్పడమే అలస్యమన్నట్లు భావించిన బీజేపి.. ఆయనను పక్కన బెట్టి, పార్టీ మైలేజ్ కోసం పాకులాండుతుందా..? అంటే అవునన్న సమాధానాలే వినబడుతున్నాయి. ఇకపై పెచ్చు ఇన్నాళ్లు దళితుడికి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేశామని చెప్పుకున్న బీజేపి ఇక రాష్ట్గాపతిగా కూడా చేశామన్న ప్రచారంతో దళితులను దగ్గర చేర్చుకోవాలిన చూస్తుంది. అందుకని రాష్ట్రపతి అభ్యర్థిగా దళితుడిని బరిలోకి దింపాలని యోచిస్తోంది.

కేంద్ర సామాజిక న్యాయ శాఖామంత్రి థావర్‌చంద్ గెహ్లట్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించనున్నట్టు సమాచారం. ఈనెల 14న ప్రధాని నరేంద్రమోదీ నాగ్‌పూర్‌లో పర్యటించనున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నాగ్‌పూర్‌లోని దీక్షభూమిలో అంబేద్కర్‌కు నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్‌తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ సమావేశంలో దళిత వర్గానికి చెందిన కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్‌చంద్‌ గెహ్లట్‌ను ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన గెహ్లట్‌కు ఆరెస్సెస్‌తో చాలా దగ్గరి సంబంధాలున్నాయి. మరోవైపు మోహన్ భగవత్‌తో భేటీకి ముందే ఈనెల 10న ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో ఢిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఎన్డీయే అగ్రనేతలందరూ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థి, కేంద్రమంత్రి మండలిలో మార్పుచేర్పులపైనా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Narendra Modi  RSS  Mohan Bhagwat  President  Prime Minister  Thawar chand gehlot  dalit  LK Advani  

Other Articles