నగదు గరిష్ట ఉపసంహరణ అంక్షల నుంచి మినహాయింపు.. Over Rs 2 lakh cash transactions exempted for withdrawls

Over rs 2 lakh cash transactions not applicable for bank post office withdrawals

Post Office, Savings Bank, cooperative banks, Finance Act 2017, Central Board of Direct Taxes, CBDT, cash withdrawals, Arun Jaitley, demonetisation, remonetisation

The ban on cash transactions of more than Rs.2 lakh a day will not apply to withdrawals from banks, post office savings accounts and cooperative banks, the Central Board of Direct Taxes said.

నగదు గరిష్ట ఉపసంహరణ అంక్షల నుంచి మినహాయింపు..

Posted: 04/06/2017 06:04 PM IST
Over rs 2 lakh cash transactions not applicable for bank post office withdrawals

పాతనోట్ట రద్దు చేపట్టడం వెనుక కేంద్ర ప్రభుత్వం అసలు ఉద్దేశ్యం ఏమిటో గానీ. అ నాటి నుంచి అంచెల వారీగా అనేక నిబంధనలు, అంక్షలను కొనసాగిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఏ ఒక్కరికీ రోజుకు రెండు లక్షల రూపాయలకు మించి నగదు లావాదేవీలు జరపరాదని దేశ ప్రజలకు షాకిచ్చిన విషయం తెలిసిందే. అయితే దీని పరిధి నుంచి పలువరుని మినహాయిస్తూన్నట్లు ఇవాళ తాజాగా ప్రకటించింది. రూ.2 లక్షలకు మించి నగదు లావాదేవీల ఆంక్షలపై తాజాగా వెలువరించిన ప్రకటనలో పలువురికి మినహాయింపు కల్పిస్తున్నట్లు తెలిపింది.

ఆదాయపన్ను చట్టంలో  కొత్తగా చేర్చిన సెక్షన్‌ ప్రకారం  బ్యాంకులకు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు , కో-ఆపరేటివ్ బ్యాంకు ఖాతాల నగదు ఉపసంహరణలకు ఈ నిబంధన వర్తించదని ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు ఇవాళ వెల్లడించింది. ఈ విషయమై త్వరలోనే అవసరమైన నోటిఫికేషన్ ను జారీ చేస్తామని తెలిపింది. ఫైనాన్స్ బిల్లు 2017లో నగదు లావాదేవీలపై నిషేధం ఉన్నప్పటికీ, ఈ  పరిమితులు బ్యాంకులు, పోస్ట్‌ ఆఫీస్‌, కోఆపరేటివ్‌  బ్యాంక్‌  సేవింగ్‌ ఖాతాదారులకు వర్తించవని స్పష్టం చేసింది. దీంతో వీరికి నగదు ఉపసంహరణల అంక్షల నుంచి మినహాయింపు లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Post Office  Savings Bank  cooperative banks  CBDT  cash withdrawals  Arun Jaitley  

Other Articles