చెప్పులు కుట్టే వ్యక్తికి ఐటీ షాక్.. ఆ డబ్బు ఎవరిది? | Why Cobbler get notices from IT Department.

It department notices to cobbler

Income Tax Department Notices, IT Notice Cobbler, Gujarat Cobbler IT Shock, Gujarat Cobbler, Note Ban IT Notices, Indian IT Notices, Junagadh Cobbler, BJP MLA Cobbler, Mahendra Mushroo Cobbler

Income Tax department notice to Gujarat cobbler for Rs 10 Lakhs bank deposit during note ban.

నోట్ల రద్దు టైంలో అంత డబ్బు ఎక్కడిది?

Posted: 04/04/2017 09:06 AM IST
It department notices to cobbler

అది గుజరాత్ లోని జునాగఢ్ ఎంజీ రోడ్ ఏరియా. రోడ్డు పక్కన ఓ వ్యక్తి పాత చెప్పులను కుట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం అతగాడి పేరు దేశం మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. అందుకు కారణం అతనేం సాధించటం కాదు. ఆదాయపు పన్నుల శాఖ అధికారులు చేసిన నిర్వాకం.

అవును చెప్పులు కుట్టుకునే ఆ వ్యక్తికి ఆదాయ పన్ను శాఖ దిమ్మదిరిగే షాకిచ్చింది. నోట్ల రద్దు సమయంలో జన్‌ధన్ ఖాతాలో రూ.10 లక్షల లావాదేవీకి లెక్కలు చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. దీంతో అవాక్కయిన మన్షుక్ మక్వాన్ (55) తన ఖాతాలో అంత డబ్బు ఉందా? అని ఆశ్చర్యపోయాడు. ఆపై అవాక్కయ్యాడు.

తన జీవితంలో అంతపెద్దమొత్తంలో ఎప్పుడూ డబ్బు చూడలేదని పేర్కొన్నాడు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే తనకు వచ్చేది కేవలం రూ.200 నుంచి 250 సంపాదిస్తానని పేర్కొన్నాడు. అలాంటిది తన ఖాతాలో రూ.10 లక్షలు ఎలా ఉంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కాగా, ఈ ఘటన స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మహేంద్ర మష్రూ అతనికి బాసటగా నిలిచాడు. ఈ విషయంపై తాను ఐటీ అధికారులతో మాట్లాడుతానని భరోసా ఇచ్చాడు.

మరోవైపు మన్షుక్ భాయ్ కి రెండు అకౌంట్లు ఉన్నాయని విచారణంలో తేలింది. ఒకట ప్రధాని జన్ ధన్ అకౌంట్ స్కీంలో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉండగా, మరో కటి ఇండియన్ బ్యాంక్ ఖాతా ఉంది. అయితే ఈ రెండంటిలో దేనిలో 10 లక్షలు జమ అయ్యాయన్న విషయంపై మాత్రం అధికారులు క్లారిటీ ఇవ్వకపోవటం అనుమానాలకు తావునిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IT Notices  Junagadh Cobbler  BJP MLA  

Other Articles