ఈ సోమవారం చిన్నమ్మకు అచ్చీ రాలేదు | Sasikala Natarajan prison transfer petition quashed.

Double shock to aiadmk chief sasikala

Sasikala Natarajan Prison Transfer, Karnataka HC Sasikala, Sasikala Jail Shift, Sasikala Faction, Sasikala EC Two Leaves, AIADMK Two Leaves, Traffic Ramaswamy Sasikala, Sasikala Ministers Jail, Tumakuru Jail Sasikala, AIADMK RK Nagar Two Leaves SYmbol, Sasikala Faction Two Leaves Symbol

Karnataka High Court rejects PIL on Sasikala Natarajan prison transfer. PIL filed by 'Traffic' Ramaswamy also dismissed. EC asks Sasikala faction to explain why it is using two-leaves symbol on social media.

శశికళకు ఒకేసారి డబుల్ షాక్

Posted: 04/04/2017 09:30 AM IST
Double shock to aiadmk chief sasikala

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్న శశికళ నటరాజన్ కు సోమవారం రెండు షాక్ లు తగిలాయి. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆమెను వేరే జైలుకు బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కర్ణాటక న్యాయస్థానం దానిని కొట్టివేసింది. పరప్పన అగ్రహార జైలు పక్క రాష్ట్రంలో ఉండటం, ఆమెను చూడటానికి పలువురు ప్రముఖులు తరచూ అక్కడికి వెళ్తుండటం చూస్తున్నాం.

అయితే జైలు నుంచే ఆమె పాలన సాగిస్తున్నారని, అందుకని ఆమెను తుముకూరులోని మహిళా జైలుకు బదిలీ చేయాలని కోరుతూ, తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో శశికళను కలిసేందుకు మంత్రులను అనుమతించవద్దని పిటిషన్‌లో విజ్నప్తి చేశాడు. దీనిపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. కలిసే ప్రతీ ఒక్కరికీ నిబంధనలు వర్తిస్తాయని, అందరికీ ఆమెను కలిసే అవకాశం ఉందని పేర్కొంది.

శశికళ బ్యాచ్ పై ఈసీ ఆగ్రహాం....

ఆర్కే నగర్ ఉపఎన్నికలో పన్నీర్ సెల్వం, శశికళ వర్గీయుల మధ్య గుర్తు కోసం సమస్య తలెత్తటంతో ఈసీ రెండాకుల గుర్తును ఫ్రీజ్ చేసి ఒకరికి టోపీ, మరొకరికి కరెంటు స్తంభం ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, శశికళ వర్గం మాత్రం సోషల్ మీడియా ప్రచారంలో రెండాకుల గుర్తును విచ్చలవిడిగా వాడేస్తోంది. దీంతో ఎన్నికల కమిషన్ తీవ్రంగా మండిపడింది. పార్టీ వెబ్‌సైట్‌తో పాటు సోషల్ మీడియా అకౌంట్లు అన్నింటి నుంచి వెంటనే రెండాకుల గుర్తును తీసేయాలని ఆదేశించింది. అలాగే, అన్నాడీఎంకే పేరు, గుర్తును ఉపయోగించకూడదని తామిచ్చిన ఉత్తర్వులను ఎందుకు ఉల్లంఘించారో వివరించాలంటూ అందుకు గురువారం ఉదయం వరకు సమయం ఇచ్చింది.

ఈసీ చెప్పాక కూడా ఉపయోగించడం ఐపీసీ 171జి సెక్షన్‌ ప్రకారం ఎన్నికల నేరమే అవుతుందని స్పష్టం చేసింది. రెండాకుల గుర్తును ప్రింట్, ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ మీడియాలలోను, పార్టీ వెబ్‌సైట్, ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి చోట్ల వాడటాన్ని వెంటనే ఆపేయాలని ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka HC  Sasikala Jail Transfer  AIADMK  Two Leaves  RK Nagar By Poll  

Other Articles