ఆ స్డూడెంట్ ను కొట్టారు.. కానీ, చనిపోలేదు | Sushma Swaraj confirms Indian Student Survives.

Indian student attacked in poland survives

Indian student Poland, Poland Attack, Poland Racist Attack, Sushma Swaraj Poland Attack, Sushma Swaraj Indian Student Attack, Indian Student Survives, Indian Racist Attack

Indian student survives attack in Poland, confirms Sushma Swaraj and demands report. Indian student beaten up in Poland in apparent racist attack.

భారతీయ విద్యార్థి హత్య.. అబద్ధం

Posted: 04/01/2017 10:12 AM IST
Indian student attacked in poland survives

పోలెండ్ లో ఓ భారతీయ విద్యార్థిపై దాడి, చనిపోయాడన్న వార్తల నేపథ్యంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించాడు. పోజ్నన్ నగరంలోని ఓ ట్రామ్ వాహనంలో గుర్తు తెలియని దుండగుడు భారతీయ విద్యార్థిపై దాడి చేయటం పెద్ద కలకలమే రేపింది. అయితే తీవ్ర గాయాలపాలైన అతగాడు చనిపోయాడంటూ లోకల్ మీడియా కథనాలు ప్రసారం చేయటంతో మన మీడియా కూడా అదే ఫాలో అయ్యింది.

సమయానికి వైద్యం అందించటంతో అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ వ్యక్తి విదేశాంగమంత్రి సుష్మస్వరాజ్ దృష్టికి తీసుకొచ్చాడు. దీంతో స్పందించిన ఆమె పోలండ్‌లోని భారత రాయబారి నుంచి నివేదిక కోరింది. అయితే దాడి జరిగిన వెంటనే స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించటంతో ప్రాణాలతో బయటపడ్డాడంట. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ లో పేర్కొంది. ఇక పోలెండ్ లోని భారత రాయబారి అజయ్ బిసారియా దాడిపై కూడా అదే విషయాన్ని ధృవీకరించాడు. ఇది వ్యక్తిగత దాడా? లేక జాతి వివక్షత దాడా? అన్నది ఇప్పుడే తేల్చలేమని, విచారణ కొనసాగుతుందని ఆయన తెలిపాడు.

మరోవైపు అమెరికాలోని ఇండియానాలో మోన్రో ఆస్పత్రిలో పనిచేస్తున్న సిక్కు వైద్యుడు డాక్టర్ అమన్‌దీప్ సింగ్‌కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు మెసేజ్ వచ్చింది. వివిధ మతాలకు చెందిన వారిని గతంలోనూ చంపానని ఆగంతుకుడు ఆ మెసేజ్‌లో పేర్కొనటంతో పోలీసులు అప్రమత్తం అయ్యాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sushma Swaraj  Poland  Indian Student Attack  Survives  

Other Articles