అయేషా ను అసలు ఎవరు చంపారు? రాసలీలల కోణం ఉందా? | Ayesha Meera parents raised new doubts.

Ayesha mother demands arrest the real culprits

Ayesha Meera Case, Satyam Babu Released, Satyam Babu High Court, Ayesha Meera Rape and Murder Case, Ayesha Meera Parents, Ayesha Meera Death Probe, Ayesha Meera Case Re Probe, Ayesha Meera Mystery

HC acquits Satyam Babu in sensational rape-murder of Ayesha Meera, raps police for framing him. Reprobe into Ayesha Meera murder demanded after Andhra court verdict. Ayesha Parents Shamshad Begum and Iqbal Baasha demands Police should arrest the real culprits.

రాసలీలలు చూసిందనే అయేషాను చంపేశారు

Posted: 04/01/2017 09:01 AM IST
Ayesha mother demands arrest the real culprits

సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్యకేసులో పిడతల సత్యంబాబు‌ను నిర్దోషిగా పేర్కొంటూ శుక్రవారం హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అయేషా మీరా తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సత్యం నిర్దొషి అని తాము మొదటి నుంచి చెబుతున్నామని తల్లి షంషాద్ బేగం అంటోంది. ఈ కేసులో నిందితులకే నేతల సపోర్ట్ కూడా ఉందన్న వాదనను వారు వినిపిస్తున్నారు. హాస్టల్ వార్డెన్ కోనేరు పద్మ నోరు తెలిస్తే ఐదు నిమిషాల్లోనే కేసు పరిష్కారమవుతుందని బేగం చెబుతోంది.

పద్మ, ఆమె భర్త అయినంపూడి శివరామకృష్ణ, హాస్టల్ విద్యార్థులు సౌమ్య, ప్రీతి, కవిత, కోనేరు సురేశ్, కోనేరు సతీష్, అబ్బూరి గణేశ్, చింతా పవన్‌కుమార్‌లకు ఈ కేసుతో సంబంధం ఉందని, వారే నిందితులని ఆరోపిస్తోంది. అయేషా వారి రాసలీలలను చూసిందనే కారణంతోనే పొట్టనపెట్టుకున్నారని, కేసును తిరిగి దర్యాప్తు చేసి అసలు దోషుల్ని పట్టుకుని శిక్షించాలని, అప్పుడే తమ కుమార్తె ఆత్మకు శాంతి కలుగుతుందని తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్ బాషాలు పేర్కొన్నారు.

దళితుడైన సత్యంబాబును పోలీసులు ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని తేల్చిన ఉన్నత న్యాయస్థానం, అత్యాచారం జరిగిందన్న వాదనను పోలీసులే తెరపైకి తెచ్చారని తేల్చి చెప్పింది. అసలైన నేరస్తులను తప్పించేందుకు, వాస్తవాలను కప్పిపుచ్చి కోర్టును తప్పుదోవ పట్టించేందుకే ఇలా చేశారని ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఇంతకు ముందు కింది న్యాయస్థానం విధించిన జీవితఖైదు, జరిమానాలను రద్దు చేసింది. ఇప్పటిదాకా అతను ఏదైనా మొత్తాన్ని చెల్లించి ఉంటే దానిని, మరో లక్ష అదనంగా కలిపి నష్టపరిహారంగా అతనికి చెల్లించాలని ఆదేశించింది.

డిసెంబర్ 27న ఏం జరిగింది...

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆయేషా మీరా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గా లేడీస్‌ హాస్టల్‌లో ఉంటూ.. నిమ్రా కాలేజీలో బీ ఫార్మసీ అభ్యసించేది. 27.12.2007న హాస్టల్‌లో ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు సత్యంబాబును అరెస్ట్‌ చేశారు. అతనే ఆయేషా మీరాను హత్య చేశాడంటూ అభియోగం మోపారు. దీనిపై విచారణ జరిపిన విజయవాడ మహిళా కోర్టు సత్యంబాబును దోషిగా నిర్ధారిస్తూ హత్య చేసినందుకు జీవితఖైదు, రూ.1,000 జరిమానా,
అత్యాచారం చేసినందుకు పదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ 29.9.2010న తీర్పునిచ్చింది.

సత్యం ఏమన్నా సూపర్ మ్యానా?

తీర్పు వెలువరించే సందర్భంగా కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‌ఆరోజు రాత్రి సత్యం హస్టల్ కు ఉన్న 8 అడుగుల గోడను రెండుసార్లు ఎక్కి దిగి, అదీగాక రోకలి బండను ఓ చేత్తో పట్టుకుని ఆయేషా గదికి వెళ్లి మరీ చంపాడని పోలీసులు పేర్కొన్నారు. ‘5.5 అడుగుల ఎత్తు, 50 కేజీల బరువున్న ఒక వ్యక్తి. అంత పెద్దగొడను పైగా అంత బరువు ఉన్న కర్రతో ఒంటిచేత్తో గోడ ఎక్కటం ఎక్కడైనా సాధ్యం అయ్యేదేనా అని విస్మయం వ్యక్తం చేసింది. సామాన్య మానవులు కాకుండా సూపర్‌మ్యాన్‌ మాత్రమే చేయగల ఫీట్‌. అదీగాక మిగతా కోణాల్లోనూ పోలీసులు చెప్పేదాంట్లో ఎందులోనూ వాస్తవం లేదు. కాబట్టి కింది కోర్టు నమ్మినా, మేము మాత్రం నమ్మలేమంటూ సత్యంను నిర్దొషిగా ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ayesha Meera  Murder and Rape Case  High Court  Satyam Babu  

Other Articles