ఆర్గ్యూమెంట్ చేస్తే.. పనిష్మెంటే.. పోలిస్ బాస్ హెచ్చరికలు.. hyderabad cp warns youth disturbing traffic police doing their work

Hyderabad cp warns youth disturbing traffic police doing their work

vehicle check, traffic police, hyderabad police commissioner, sandeep shandilya, punishment, jail sentence, disturbing police officials, vehicle documents

hyderabad police commissioner, sandeep shandilya warns youth for punishment of jail, those who disturb traffic police doing their work

ఆర్గ్యూమెంట్ చేస్తే.. పనిష్మెంటే.. పోలిస్ బాస్ హెచ్చరికలు..

Posted: 03/25/2017 01:41 PM IST
Hyderabad cp warns youth disturbing traffic police doing their work

మీ వాహనానికి సంబందించిన అన్ని ఖాయితాలు.. అవేనండీ అర్ సీ, డ్రైవింగ్ లైస్సెన్స్, ఇన్యూరెన్స్, పోల్యూషన్ లాంటివన్నీ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తూన్నా పోలీసులు కనబడి వెహికల్ చెక్ చేస్తుంటే.. అన్ని వున్నాయి కాదా అని చూపించి దురుసుగా ప్రవర్తించవచ్దు. ఎందుకంటే అలా చేస్తే పోలీసు విధులను మీరు ప్రతిబంధకంగా నిలిచినట్టే. ఇందుకు గాను మీరు లెక్కబెట్టాల్సిందే.

అదేంటి ఏం లెక్కబట్టాల్సి వుంటుంది అంటారా..? ఊచలు. అవునండీ.. ఇది నిజం. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ బాస్ సందీఫ్ శాండిల్య హెచ్చరికలు జారీ చేశారు. ట్రాఫిక్ పోలీసులు వెహికల్ చెక్ చేస్తున్నప్పడు సహనం కోల్పోవడం కన్నా వారి విధులకు సహనంతో సహకరించాలని సూచించారు. అలా కాకుండా వారి విధులకు అటంకం కలిగించినా, లేక సహనం కోల్పోయి.. నోరు జారినా మీకు ఇక కటకటాల పాలు కావాల్సిందేనని సూచించారు.

విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన నలుగురి ఇటీవలే కటకటాల వెనక్కు నెట్టి విషయాన్ని గుర్తు చేసిన ఆయన పోలీసులు విదులు వారిని చేసుకోవాలన్నారు. వారి విధులకు పౌరులు ప్రతిబంధకంగా మారరరాదన్నారు. అనవసరంగా వాదనలకు దిగే వాహనదారులను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. సిబ్బంది కూడా నిబద్దతతో పని చేయాలన్నారు.

అయితే రూల్స్ బ్రేక్ చేసి చలానా కాకుండా.. లంచం డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు చేయటాన్ని ఆయన ఖండిస్తూనే.. అలాంటి విషయాలు ఉండే ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. వాహనదారుల వద్ద డబ్బులేని పక్షంలో ఈ చాలాన్ రాయించుకోవాలని, తరువాత వారు డెబిట్ కార్డుతో లేదా క్రెడిట్ కార్డుతో వాటిని చెల్లించవచ్చునన్నారు. ఇలా కాకుండా ట్రాఫిక్ పోలీసులతో వాదనలకు దిగారంటే ఊచలు లెక్కబెట్టాల్సిందే. జాగ్రత్త సుమా..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles