గంటా ఇంట్లో చోరీ.. తేలు కుట్టిన దొంగలా పరిస్థితి ap education minister ganta srinivasa rao house stolen

Ap education minister ganta srinivasa rao house stolen

AP minister, ap education minister, ganta srinivasa rao, home, theft, robbery, vizag, mvp colony, platinum budha idol, golden neclalace, ganta house theft, ganta theft, ap minister house theft, minister theft, crime

andhra pradesh education minister ganta srinivasa rao house stolen by unidentified miscreants in the late hours friday. minister and his family were out of station when the incident took place.

గంటా ఇంట్లో చోరీ.. తేలు కుట్టిన దొంగలా పరిస్థితి

Posted: 03/25/2017 12:55 PM IST
Ap education minister ganta srinivasa rao house stolen

ఆంద్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో చోరీ జరిగింది. అదేంటి సాక్షాత్తు మంత్రి నివాసంలోనే దొంగతనం జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారు అని అగడవద్దు. ఎందుకంటే మంత్రిగారి ఇంటికే కపాలా కాయలేని పోలీసులు రాష్ట్ర ప్రజల మాన, ప్రాణాలకు, శాంతిభద్రతలను మాత్రం ఎలా చూసుకుంటారు అన్న ప్రశ్నలు తెరపైకి రావచ్చు. అది కాస్తా ప్రభుత్వానికి శరాఘాతంలా తయారు కావచ్చు. దీంతో ప్రభుత్వం పరువు పోవచ్చు.. అన్న నేపథ్యంలో గంటావారి పరిస్థితి తేలు కుట్టిన దొంగలా మారింది.

ఈ దోంగతనం వార్తలపై ఏకంగా వైజాగ్ అంతా కోడై కూస్తున్నా.. తమకు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి పిర్యాదు రాలేదని ఎంవీపీ జోన్‌ సీఐ మళ్ల మహేష్‌ తెలిపారు. ఈ ఘటనపై పిర్యాదు చేస్తే ప్రభుత్వం పరువుతో పాటు తన పరువు పోతుందనే గంటా కుటుంబం కానీ, ఇతర సభ్యులు కానీ దోంగతనంపై పోలీసులకు పిర్యాదు చేయలేదని సమాచారం. కాగా పిర్యాదు నమోదు చేయకుండానే పోలీసులు మంత్రిగారింట్లో కన్నం వేసిన దొంగలను వెతికేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు సమాచారం.

వైజాగ్ లోని ఎంవీపీ కాలనీ సెక్టార్‌–4లోని గంటా నివాసంలో ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి ఇంట్లో వెనుక వైపు నుంచి ప్రవేశించిన దొంగలు... బుద్ధుడి ప్లాటినం విగ్రహం, ఒక హారం, నెక్లెస్‌ ను తీసుకుపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు మంత్రి కుటుంబం ఊర్లో లేని సమయంలో ఈ ఘటన జరగడంతో మంత్రి గురించి సమస్త సమాచారం తెలిసినవారే ఈ దొంగతనానికి పాల్పడి ఉండవచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap education minister  ganta srinivasa rao  theft  robbery  vizag  mvp colony  platinum budha idol  crime  

Other Articles

Today on Telugu Wishesh